Movie News

నాని వెంట పడుతున్న నెట్ ఫ్లిక్స్

ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కి న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో తన సినిమాల ఓటిటి హక్కులు తనకే కావాలని రేట్ ఎక్కువ చెబుతున్నా సరే డిమాండ్ చేసి మరీ తీసేసుకుంటోంది. ఇది ‘అంటే సుందరానికి’తో మొదలైంది. దాని బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ దగ్గరే ఆగిపోయినా డిజిటల్ లో మాత్రం దుమ్ము రేపింది. గత ఏడాది ‘దసరా’తో మిలియన్ల వ్యూస్ తాకిడి వచ్చి పడింది. మల్టీ లాంగ్వేజ్ వెర్షన్లు కావడంతో సబ్ టైటిల్స్ అవసరం లేకుండానే అన్ని రాష్ట్రాల ఆడియన్స్ ఈ మాస్ బ్లాక్ బస్టర్ ని ఎగబడి చూశారు. వారాల తరబడి టాప్ 5లో ఉంది.

ఇటీవలే ‘హాయ్ నాన్న’ను సొంతం చేసుకుని తిరిగి అదే ఫలితాన్ని రిపీట్ చేసుకుంటోంది. సలార్,యానిమల్ రాక ముందు వరకు నెట్ ఫ్లిక్స్ లో డామినేషన్ పూర్తిగా ఈ ఎమోషనల్ డ్రామాదే. హిందీ వెర్షన్ సైతం భారీ రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. తాజాగా నిర్మాణంలో ఉన్న ‘సరిపోదా శనివారం’ సైతం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు నలభై అయిదు కోట్లకు డీల్ జరిగినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ గత చిత్రం కంటే పదిహేను కోట్లు ఎక్కువ చెప్పినా వెనుకాడలేదట. థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాని సరిపోదా శనివారంకి వివేక్ ఆత్రేయ దర్శకుడు.

ఇలా ఒకే హీరో సినిమాలు వరసగా కొనడంలో నెట్ ఫ్లిక్స్ చిరంజీవి తర్వాత నానికే చేస్తోంది. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లను పట్టేసుకుని తాజాగా విశ్వంభర కోసం గట్టిగా ట్రై చేస్తోందట. సౌత్ మీద వందల కోట్ల పెట్టుబడులతో ప్రైమ్, హాట్ స్టార్, సోనీలను పూర్తిగా వెనక్కు నెట్టేసే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ 2024లో పదికి పైగానే క్రేజీ మూవీస్ ని సొంతం చేసుకుంది. వాటిలో పుష్ప 2, దేవర 1, విడి 12 లాంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. నాని నెక్స్ట్ ఏ కాంబినేషన్ ఒప్పుకున్నా నెట్ ఫ్లిక్స్ వెంటనే రంగంలోకి దిగి సదరు నిర్మాతలతో ఒప్పందాలు చేసుకునేలా ఉంది.

This post was last modified on January 30, 2024 9:59 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

8 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

38 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago