ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించే వార్తే. కానీ ఇది నిజమే అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న థ్రిల్లర్ మూవీ పుష్పలో నారా రోహిత్ ఓ ముఖ్య పాత్ర పోషించే అవకాశాలున్నాయట. ఈ విషయం ఇంకా ఖరారవ్వలేదు కానీ.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కొన్ని ముఖ్య పాత్రలు ఉన్నాయి.
అందులో ఒకదాని కోసం రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రోహిత్ కోసం సిఫారసు చేసింది అల్లు అర్జున్ అట. మరి అతడికి రోహిత్ పట్ల అంత ఆసక్తి ఏంటో తెలియదు. మరి నిజంగానే పుష్పలో రోహిత్‌కు అవకావం దక్కుతుందేమో చూడాలి.
కెరీర్ ఆరంభంలో వైవిధ్యమైన సినిమాలతో రోహిత్ మంచి ఊపులోనే కనిపించాడు. ఒక దశలో అతను హీరోగా అరడజనుకు పైగా సినిమాలు లైన్లో ఉన్నాయి. కానీ కథల ఎంపికలో పొరబాట్లు, వరుస పరాజయాలు రోహిత్‌ను వెనక్కి లాగేశాయి. ఇప్పుడు అతను ఇండస్ట్రీలో ఉన్న విషయమే జనాలకు గుర్తు లేదు. రోహిత్ కొత్త సినిమాలు పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో పుష్ప సినిమాకు అతణ్ని కన్సిడర్ చేస్తున్నారన్న వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. పుష్ప కాస్టింగ్ విషయంలో సుకుమార్ కన్ఫ్యూజన్ ఒక పట్టాన తెమలట్లేదు. ప్రధాన విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని అనుకున్నాక అతను డేట్ల సమస్యతో తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ పాత్రకు బాబీ సింహా, అరవింద్ స్వామిల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఎవరూ ఖరారు కాలేదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates