Movie News

అక్క కోసం పోరాడే ‘అంబాజీపేట’ కుర్రాడు

సోలో హీరోగా కలర్ ఫోటో లాంటి అవార్డు సినిమలో భాగమై గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరైన సుహాస్ కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2 విడుదలవుతోంది. ప్రమోషన్ల విషయంలో క్రియేటివ్ గా వెళ్తున్న టీమ్ గతంలో టీజర్ ద్వారా ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశారు. తాజాగా ట్రైలర్ ని హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో ఘనంగా లాంచ్ చేశారు. సంక్రాంతి రిలీజుల తర్వాత రెండు వారాల దాకా టాలీవుడ్ నుంచి ఏ స్ట్రెయిట్ మూవీ రాకపోవడం ఈ మ్యారేజ్ బ్యాండ్ కి కలిసి వచ్చేలా ఉంది. ఇంతకీ కథాకమామీషు ఏం చెప్పారో చూద్దాం.

అంబాజీపేటలో సెలూన్ నడుపుకుంటూ పెళ్లిళ్లు, చావులకు బ్యాండ్ మేళం వాయించే కుర్రాడు మల్లి(సుహాస్). ఊళ్ళో పెద్ద కులానికి చెందిన లక్ష్మి(శివాని)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. స్కూల్లో టీజర్ గా పని చేసే మల్లి అక్కయ్య(శరణ్య ప్రదీప్) మీద కన్నేసిన ఓ మోతుబరి (నితిన్ ప్రసన్న) వల్ల వీళ్ళ కుటుంబం చిక్కుల్లో పడుతుంది. ఎలాగైనా వీళ్ళను అణచాలని కంకణం కట్టుకున్న దుర్మార్గులు మల్లికి గుండు కొట్టించి అవమానించడమే కాక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరిగెత్తేలా చేస్తారు. దీంతో మల్లి తిరగబడతాడు. తోడబుట్టిన దాన్ని కాపాడుకుంటూ ప్రేమని ఎలా గెలిచాడనేదే స్టోరీ.

పూర్తి పల్లెటూరి నేపథ్యంలో వినోదంతో పాటు ఇంటెన్స్ డ్రామాని జొప్పించాడు దర్శకుడు దుశ్యంత్ కటికనేని. సుహాస్ లోని పెర్ఫార్మర్ ని మరోసారి వెలికి తీశాడు. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం, వాజిద్ బేగ్ ఛాయాగ్రహణం సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. హీరోయిన్ శివాని సహజంగా ఉండగా పుష్ప జగదీశ్, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన క్యాస్టింగ్ లో ఉన్నారు. అక్క సెంటిమెంట్ తో పాటు మాస్ లవ్ స్టోరీని టచ్ చేసిన దుశ్యంత్ ట్రైలర్ కట్ తో అంచనాలైతే అందుకున్నాడు. అసలు కంటెంట్ కూడా ఇంతే స్థాయిలో ఉంటే సుహాస్ ఖాతాలో ఇంకో సూపర్ హిట్ పక్కానే.

This post was last modified on January 24, 2024 1:35 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

16 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

23 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago