హనుమాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఏమో కానీ రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ లో ఆయన రిఫరెన్స్ ఉండటం కాకతాళీయంగా పెరుగుతోంది. నిన్న చిరంజీవి విశ్వంభరలో ఏకంగా పెద్ద అంజనీ పుత్రుడి విగ్రహాన్ని చూపించి కథలో కీలక భాగం కాబోతున్నారని చెప్పకనే చెప్పారు. స్వతహాగా ఆయనకు మెగాస్టార్ వీరభక్తుడు కావడంతో సహజంగానే ఆయా సన్నివేశాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడీ లిస్టులో మరో సినిమా తోడవుతోంది. నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభులో తాను హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్టు నిఖిల్ స్వయంగా వెల్లడించడంతో ఓ ముఖ్యమైన క్లూ ఇచ్చేసినట్టే.
ఇతిహాసాల నేపథ్యంలో భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎపిక్ డ్రామా కోసం నిఖిల్ నెలల తరబడి కత్తి యుద్దాలు, కుస్తీలు నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీలు అలవాటయ్యాయి. ఆయుధాలును వాడటంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. కొంచెం లేట్ అవుతున్నా పాత్రకు తగ్గ సన్నద్ధత కోసం కష్టపడుతున్నాడు. కార్తికేయ 2 తెచ్చిన ప్యాన్ ఇండియాని పెంచుకునే క్రమంలో 18 పేజెస్ ఓ మోస్తరుగా ఆడినా స్పై నిరాశ పరిచింది. అందుకే స్పీడ్ కంటే క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించిన నిఖిల్ దానికి తగ్గట్టే స్వయంభు కోసం చాలా సమయం ఖర్చు చేస్తున్నాడు.
ఇది కాకుండా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలతో స్టార్ లీగ్ లోకి వెళ్తాననే నమ్మకంతో నిఖిల్ ఉన్నాడు. స్వయంభు ఈ ఏడాది దసరా లేదా దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. హనుమాన్ నార్త్ ఇండియాలోనూ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ బయ్యర్లు, నిర్మాతలు నిర్మాణంలో భారీ తెలుగు చిత్రాల మీద హక్కుల కోసం కన్నేస్తున్నారు. స్వయంభుకి బిజినెస్ ఎంక్వయిరీలు వస్తున్నాయి. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ ని ఇంకా ప్రకటించలేదు.
This post was last modified on January 16, 2024 9:32 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…