2023ను సినీ పరిశ్రమకు సంబంధించి షారుక్ నామ సంవత్సరంగా పేర్కొనవచ్చు. ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే లేని విధంగా ఓకే ఏడాది 2000 కోట్ల సినిమాలను ఇచ్చిన ఏకైక హీరోగా షారుక్ నిలిచాడు. పఠాన్, జవాన్ రెండు చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించిన విషయం తెలిసిందే. వచ్చిన ఏడాది చివర్లో వచ్చిన డంకీ కూడా ఉన్నంతలో మంచి విజయమే సాధించింది. ఇప్పుడు తన కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు షారుక్.
అయితే ఈ మూడు సినిమాలకు ముందు షారుక్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా సాగింది. చాలా ఏళ్ల పాటు ఒక మోస్తరు విజయం కూడా లేకుండా షారుక్ సతమతమయ్యాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా తలెత్తాయి. ఆ దశ గురించి అప్పుడెప్పుడు మాట్లాడని షారుక్.. ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. తన జీవితంలో అత్యంత బాధాకర రోజుల గురించి అతను మాట్లాడాడు.
“గత ఏడాది నాకు గొప్పగా సాగింది. మరపురాని విజయాలను అందుకున్నాను. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమను చూపించారు. కానీ ఈ మూడు సినిమాలకు ముందు నేను చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాను. చాలా ఏళ్లుగా నా సినిమాలేవి సరిగా ఆడలేదు. అపజయాలు ఎదురయ్యాయి. దీని మీద మీడియాలో రకరకాలుగా రాశారు. నా పని అయిపోయిందని అన్నారు. అప్పుడు చాలా బాధపడ్డా. అది చాలదని నా కొడుకు మీద మాదక ద్రవ్యాల కేసు నన్ను, నా కుటుంబాన్ని కుదిపేసింది. అప్పుడు చాలామంది అసహ్యకరమైన కామెంట్లు చేశారు. కానీ అన్నిటికీ మౌనమే సమాధానమని ఊరుకున్నా. తర్వాత అన్ని సమస్యల నుంచి బయటపడ్డా. నా సినిమాలు విజయాలు సాధించాయి. పఠాన్ నాకు మళ్ళీ ఊపిరి పోసింది. కష్టాలు వస్తే జీవితం ఆగిపోయిందని అనుకోకండి. ఆశతో జీవించండి అయిపోయింది” అని షారుక్ పేర్కొన్నాడు.
This post was last modified on January 11, 2024 11:29 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…