Movie News

శ్రీలీల ‘మంచి’ నిర్ణయం

తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే శ్రీలీలే. అచ్చ తెలుగు అమ్మాయి అయిన శ్రీ లీల రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు రావడం విశేషం. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆమె.. అక్కడి ఫిలిం ఇండస్ట్రీలో కథానాయక పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది. తెలుగులో నటించిన తొలి చిత్రం పెళ్లి సందడి హిట్ కావడం, శ్రీలీలకు మంచి పేరు రావడంతో ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది.

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన మహేష్ బాబు సరసన ఆమె నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా బాగా ఆడితే శ్రీ లీల కెరీర్ ఇంకో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఇంకో రెండేళ్ల పాటు శ్రీలీల డైరీలో ఖాళీయే లేదు.

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే ఇంకోవైపు బ్రాండ్ల ప్రచారంలోనూ శ్రీలీల దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అర డజనుకు పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఇంకా బోలెడన్ని ఆఫర్లు వస్తుండగా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా ఒక మద్యం బ్రాండ్, ఓ అలాగే బెట్టింగ్ యాప్ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. కానీ అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని శ్రీలీల ఖరాఖండిగా చెప్పేసిందట. జనాలను తప్పుదోవ పట్టించే, వారిపై ప్రతికూల ప్రభావం చూపించే బ్రాండ్లకు ప్రచారం చేయకూడదని శ్రీలీల ముందే రూల్ పెట్టుకుందట. ఆ ప్రకారమే ఎంత పారిశోషకం ఆఫర్ చేసినా సరే ఆ బ్రాండ్లకు నో చెప్పేస్తోందట.

బాలీవుడ్లో అమితాబచ్చన్, టాలీవుడ్లో అల్లు అర్జున్ లాంటి వారు ఇలాంటి రూల్స్ పెట్టుకుని పని చేస్తున్నారు. శ్రీలీల సైతం మంచి ప్రిన్సిపుల్స్ పెట్టుకుని ఇలాంటి బ్రాండ్లకు నో చెప్పడం ద్వారా ప్రశంసలు అందుకుంటోంది.

This post was last modified on January 11, 2024 2:07 pm

Share

Recent Posts

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

23 minutes ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

25 minutes ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

1 hour ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

3 hours ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

4 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

6 hours ago