గత నెల డిసెంబర్ ఒకటిన యానిమల్ తో పాటు నయనతార అన్నపూరణి థియేటర్లలో విడుదలయ్యింది. తెలుగులో పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు హీరోయిన్ మార్కెట్ తక్కువ కావడంతో డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయలేదు. తీరా చూస్తే తమిళనాడులో పెద్దగా విజయం సాధించలేదు. యావరేజ్ కంటెంట్ కి తోడు వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తడంతో బొమ్మ బోల్తా కొట్టేసింది. కట్ చేస్తే ఇటీవలే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అన్ని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది. ఎలాగూ థియేటర్లలో మిస్ అయ్యాం కదాని జనాలు భారీ ఎత్తున ఇళ్లలో ప్రీమియర్లు వేసుకుని చూశారు.
తీరా షో చూశాక మెయిన్ పాయింట్, దాన్ని డీల్ చేసిన విధానం చూసి భగ్గుమంటున్నారు. అన్నపూరణి ఒక స్వచ్ఛమైన బ్రాహ్మల అమ్మాయి స్టోరీ. చెఫ్ కావాలని కలలు కనే క్రమంలో ఒక ముస్లిం యువకుడిని ఇష్టపడుతుంది. అంతే కాదు బిర్యానీ వండటం నేర్చుకుని మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ఫైనల్ దాకా వెళ్తుంది. పోటీ గెలిచేందుకు మాంసాహారం గొప్పగా వండాలంటే ముందు నమాజ్ చేయాలనే హీరో తల్లి చెప్పిన మాట విని బుర్ఖా వేసుకుని మరీ ప్రార్ధన చేస్తుంది. చివరికి విన్నర్ అవుతుంది. దీంట్లో చూపించిన వ్యవహారమంతా కొన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఏకంగా కేసు దాకా వెళ్లిపోయారు.
ఈ అన్నపూరణి లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిని ముస్లిం పద్దతిలో మార్చేలా దారుణంగా చిత్రీకరించారని కొందరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంతో వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కబోతోంది. నిజంగానే తీసుకున్న థీమ్ ని కొంచెం ఓవర్ గానే దర్శకుడు నీలేష్ కృష్ణ చిత్రీకరించాడు. అనువాదం పుణ్యమాని తమిళం రాని వాళ్ళు కూడా సినిమా చూసేసి టీమ్ మీద ఫైర్ అవుతున్నారు. దెబ్బకు ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఓ లుక్ వేస్తున్నారు. తన యాభైయ్యవ సినిమాకు ఇలాంటి కాంట్రావర్సీ నయన్ ఊహించి ఉండదు.
This post was last modified on January 9, 2024 2:18 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…