ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు డబ్బింగ్ వెర్షన్ హక్కులు కొనడంతో జనవరి 12నే అయలాన్ విడుదలవుతుందనే ప్రచారానికి చెక్ పడిపోయింది. పండక్కు రిలీజ్ చేయడం లేదని, వేరే మంచి డేట్ చూసుకుని ప్లాన్ చేస్తామని దిల్ రాజు చెప్పడంతో ఈ టాపిక్ కి ఫుల్ స్టాప్ వచ్చింది. ఉత్తరాంధ్ర, నైజామ్ థియేట్రికల్ రైట్స్ ని ఆయన, మిగిలిన ఏరియాలను మరికొందరు పంపిణీదారులు కొనడంతో ఖచ్చితంగా శివ కార్తికేయన్ సినిమా పండక్కి వస్తుందనే టాక్ ట్రేడ్ లో వినిపించింది. అయితే ఆచరణలో అదంత సులభంగా కాదని తేలిపోవడంతో ఫైనల్ గా రేసు నుంచి పక్కకు తీసుకొచ్చారు.
ఇదంతా ముందే ఊహించే కెప్టెన్ మిల్లర్ సైతం ఏపీ తెలంగాణ రిలీజ్ గురించి ఆలోచించలేదు. అయలాన్ రావడం మీద కుడా అనుమానాలు తలెత్తాయి కానీ ఒక్క రోజులో జరిగిన పరిణామాలు కొత్త టాక్ ని సృష్టించాయి. ఏదైతేనేం ఇప్పుడిది పూర్తిగా తప్పుకోవడం ఒకరకంగా ఇరువైపులా మంచిదే. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, హనుమాన్ లకు పోటీ ఇచ్చే రేంజ్ శివ కార్తికేయన్ కు లేదు. అయితే వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్ సక్సెస్ ల వల్ల ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రిన్స్ ఫ్లాప్ అయినా, మహావీరుడు యావరేజ్ గా ఆడినా ఓపెనింగ్స్ పరంగా రెండూ నిరాశపరచలేదు.
తమిళంలో అయలాన్ కు మంచి టాక్ వస్తే కాస్త లేట్ గా ఇక్కడ రిలీజ్ చేసినా ఇబ్బంది లేదు. ఏదైనా తేడా కొడితే ఇబ్బందులు తప్పవు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ కు సైతం ఈ అంశమే కీలకం కానుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ రూపొందిన అయలాన్ కు కనీసం తెలుగు పేరు పెట్టకుండా అదే టైటిల్ ని యధాతథంగా కొనసాగిస్తున్నారు. ఒక వారం రోజులు అయ్యాక ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి తన సినిమాను ప్రమోట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు శివ కార్తికేయన్. జనవరి 19 లేదా 26 ఈ రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకుని మిల్లర్ తో పాటు ఒకేసారి మన థియేటర్లలో అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 8, 2024 5:56 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…