ప్రస్తుతం ఇండియాలో సెట్స్ మీద ఉన్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్నది ‘కల్కి 2898 ఏడీ’కే అనడంలో సందేహం లేదు. అసలే ప్రభాస్ సినిమా. పైగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అందులోనూ ఇది హాలీవుడ్ స్టయిల్లో సాగే సైన్స్ ఫిక్షన్ మూవీ. అలాగే మన స్టయిలో ఫాంటసీ టచ్ కూడా ఉంది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కొన్ని నెలల కిందటే వచ్చిన టీజర్ ఓ రేంజిలో ఉండటంతో హైప్ ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు కలిసి వచ్చే మరో పరిణామం చోటుచేసుకుంది. కల్కి కంటే ముందు ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయడంతో అభిమానులు డీలా పడిపోయారు. సలార్ కూడా తేడా కొడితే ప్రభాస్ మార్కెట్ కు చాలా డ్యామేజీ జరిగేది. ఆ ప్రభావం ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం కల్కి మీద కూడా పడేది. కానీ సలార్ తిరిగి ప్రభాస్ బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని చాటింది.
ఈ చిత్రం డివైడ్ టాక్ తోనే వారం రోజుల్లోపే 500 కోట్ల వసూళ్లు సాధించడంతో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా వేరే లెవెల్ అని అందరికీ అర్థమైంది. సలార్ సూపర్ సక్సెస్ కావడం కల్కి మేకర్స్ కు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు. ప్రభాస్ తిరిగి తన బాక్సాఫీస్ సింహాసనాన్ని సొంతం చేసుకోవడం కల్కి లాంటి భారీ చిత్రానికి బాగా కలిసి వస్తుందా అన్నంలో సందేహం లేదు. ఆ సినిమా ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు వేరే స్థాయిలో ఉంటాయనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on December 28, 2023 9:04 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…