గత నెల పదిహేడున విడుదలైన మంగళవారంకు థియేట్రికల్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆ టాక్ కి ఆశించినట్టు అద్భుతాలు చేయలేకపోయింది. కమర్షియల్ గా సేఫ్ అయినప్పటికీ దర్శకుడు అజయ్ భూపతి అంతకు మించి ఫలితాన్ని ఆశించాడు. ప్రధానంగా దీన్ని వసూళ్ల మీద ప్రభావం పడడానికి ప్రధాన కారణం సినిమా రిలీజైన మూడో రోజునే వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉండటంతో అధిక శాతం జనం ఇళ్లలోనే ఉండిపోయారు. మన టీమ్ ఓడిపోయింది కానీ అప్పటికే ఈవెనింగ్ షో పూర్తయిపోవడంతో మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా లేకపోయింది.
తర్వాత వరసగా కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో ఆ తాకిడిలో కొంత వెనుకబడిపోయింది. కట్ చేస్తే మొన్నటి నుంచి మంగళవారం టైటిల్ లో ఉన్న రోజే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ స్క్రీన్ మీద మిస్సయిన ఆడియన్స్ చాలా మంది కంటెంట్ బాగానే ఉంది కదాని ట్వీట్లు, పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ముఖ్యంగా ట్విస్టులకు ఆశ్చర్యపోతున్న వైనం చూడొచ్చు. రిలీజ్ టైమింగ్ ఏ కొంచెం అటుఇటు అయినా రిజల్ట్ ఎలా మారిపోతుందో చెప్పడానికి మంగళవారం ఒక ఉదాహరణ పాయల్ రాజ్ పుత్ రిస్క్ చేసి ఈ పాత్రకు ఒప్పుకోవడం వెనుక కష్టం తెలుస్తోంది.
ఓటిటి తీర్పులు ఇలాగే ఉంటాయి. కొన్నసార్లు బ్లాక్ బస్టర్లు ట్రోల్ అవుతాయి. మరికొన్ని సూపర్ హిట్లు విమర్శలకు గురవుతాయి. ఇంకొన్ని ఫ్లాపులు అసలు ఎందుకు తిరస్కరింపబడ్డాయనే దాని మీద డిబేట్లకు దారి తీస్తాయి. థియేటర్లో అనుభూతి చెందటానికి, ఇంట్లో కూర్చుని ఫార్వార్డ్ చేసుకుంటూ చూడటానికి చాలా తేడాలుంటాయి. తెరమీద వచ్చే ఎక్స్ పీరియన్స్ స్మార్ట్ స్క్రీన్ ఇవ్వదని చాలాసార్లు ఋజువయ్యింది. ఎక్కడిదాకో ఎందుకు బేబీ, జైలర్, లియోలు కలెక్షన్ల వర్షం కురిపించినా తీరా డిజిటల్ లోకి వచ్చాక అంత గొప్పగా ఎలా ఆడాయని ప్రశ్నించిన వాళ్లే ఎక్కువ. ట్రెండ్ అలా ఉంది మరి.
This post was last modified on December 28, 2023 2:38 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…