Movie News

శౌర్యాంగ పర్వం ముందు ఎన్నో ప్రశ్నలు

సలార్ 1కి సీజ్ ఫైర్ లాగా పార్ట్ 2 సీక్వెల్ కి శౌర్యాంగ పర్వం పేరుని ఫిక్స్ చేసి ఆ మేరకు సినిమా చివర్లో కార్డు వేసిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ దీంట్లో ఎన్నో చిక్కుముడులను విప్పాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది దేవా తండ్రి ఎవరనేది. బాహుబలి తరహాలో ఈ పాత్ర కూడా ప్రభాసే చేశాడని, చాలా సర్ప్రైజింగ్ గా ఆ క్యారెక్టర్ ఉంటుందని గతంలోనే లీక్ వచ్చింది. కానీ ఈశ్వరి రావు భర్త ఎవరనేది గుర్తుకు రాకుండా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేశారు. ఇక హీరోయిన్ శృతి హాసన్ ని విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది.

జగపతిబాబుకి సీజ్ ఫైర్ లో ఊహించినంత స్పేస్ దక్కలేదు. సో ఆయన ఇప్పుడు కీలకం కాబోతున్నారు. వరదరాజగా నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ స్నేహితుడికి మీద అంత ప్రేమను పెంచుకున్నప్పుడు తన జాతికి జరిగిన ద్రోహం గురించి దేవా ఎందుకు నిలదీయలేదనే లాజిక్ సలార్ 2లోనే తెలియాల్సి ఉంది. పైగా ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం వేరే ఉంది. కులాల మధ్య వైరాన్ని చూపించారు కానీ అవి ఎంత లోతుగా ఉండేవన్నది క్లారిటీ ఇవ్వాలి. దేవాకు ఆద్య మీద ప్రేమ కలిగిందో లేదో చెప్పలేదు. స్పెషల్ సాంగ్ ఏమైనా ఈసారి ఉందో లేదో చూడాలి.

చెప్పుకుంటూ పోతే ఇతర అంశాలు స్పాయిలర్స్ అవుతాయి కానీ సీజ్ ఫైర్ కన్నా ఎక్కువ కంటెంట్ శౌర్యాంగ పర్వంలోనే ఉండబోతోందనేది వాస్తవం. వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో ప్యాన్ ఇండియా మూవీ కమిటైన ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. దేవర, వార్ 2లో ఏమైనా ఆలస్యం జరిగితే తప్ప నీల్ ఫ్రీ కాలేడు. సలార్ 2 స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందట. హోంబాలే ఫిలిమ్స్ ఈసారి బడ్జెట్ ని మరింత పెంచి నెవర్ బిఫోర్ యాక్షన్ గ్రాండియర్ గా ఆ సినిమా తీసేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది.

This post was last modified on December 23, 2023 10:15 pm

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

26 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

1 hour ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

3 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago