Movie News

ప్రభాస్.. అదేం కటౌట్ స్వామీ?

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా 10 రెట్లు, అంత కంటే ఎక్కువే పెరిగింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అవతరించాడు ఈ టాలీవుడ్ హీరో. కానీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిన ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే సినిమాలు తర్వాత రాలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్.. ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి నిరాశపరిచాయి. ఈ స్థితిలో ప్రభాస్.. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జట్టు కట్టగానే ఇది కదా కాంబినేషన్ అంటే అనిపించింది అభిమానులకు.

కేజిఎఫ్ లో మాస్ ఇమేజ్ లేని యశ్ లాంటి చిన్న హీరోతో అదిరిపోయే రేంజ్ లో ఎలివేషన్స్ సీన్లు పండించిన ప్రశాంత్.. ప్రభాస్ ను ఇంకెలా చూపిస్తాడో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయింది. ఈ రోజు సలార్ సినిమా చూసిన వాళ్ళందరూ ప్రభాస్ ను ప్రశాంత్ ప్రజెంట్ చేసిన విషయంలో పూర్తి సంతృప్తి చెందారు.

సలార్ సినిమాలో ప్రభాస్ పాత్ర గొప్పగా ఏమీ లేదు. కేజిఎఫ్ లో రాఖీ పాత్ర లాగా ఇందులో క్యారెక్టర్ గ్రాఫ్ పెద్దగా కనిపించదు. క్యారెక్టర్ పరంగా షేడ్స్ కూడా తక్కువే. పెర్ఫామెన్స్ విషయంలోనూ ప్రభాస్ పెద్దగా స్కోర్ చేసింది లేదు. కానీ సినిమాలో ప్రభాస్ కనిపించే ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు. అందుకు కారణం ప్రభాస్ కటౌట్, తన స్క్రీన్ ప్రెజెన్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ ను మాస్ కోణంలో ది బెస్ట్ గా చూపించింది ప్రశాంత్ అనడంలో సందేహం లేదు. ఇలాంటి మాస్ కటౌట్ ఇప్పటిదాకా ఎవరికీ లేదు, ఇకముందు ఎవరికి రాదు అనిపించే స్థాయిలో ప్రభాస్ కనిపించాడు తెరమీద. ఇదేం కటౌట్ ఇదేం స్క్రీన్ ప్రెజెన్స్ స్వామీ అని ప్రేక్షకులు నోరెళ్ళబెట్టి చూసేలా తనను చూపించాడు ప్రశాంత్ నీల్.

యాక్షన్ ఘట్టాల గురించి, ఎలివేషన్స్ సీన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటర్వల్ ఎపిసోడ్, ద్వితీయార్థంలో దేవత ముందు జరిగే ఫైట్ ఎపిసోడ్, క్లైమాక్స్ లో ప్రభాస్ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేశాయి. ఓవరాల్ గా సలార్ సినిమా వీకే అయినప్పటికీ.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వాడుకొని ఎలివేషన్, యాక్షన్ సీన్లను పేలిపోయేలా మలచడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈజీగా పాస్ అయిపోయేలా కనిపిస్తోంది.

This post was last modified on December 22, 2023 7:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ఫేవరెట్ తెలుగు సినిమా ఏంటంటే…

ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…

4 minutes ago

పుష్ప రాజు ఏదో సంకేతం ఇస్తున్నాడు…

ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…

1 hour ago

కాశిలో తండేల్ పాట…ఎన్నో ప్రశ్నలకు సమాధానం!

నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…

3 hours ago

రేవతి కుమారుడు కోలుకోడానికి మేము ఏమైనా చేస్తాం : అల్లు అరవింద్!

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…

3 hours ago

ఎమ్మెల్యేలకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…

3 hours ago