సలార్ బాక్స్ ఆఫీస్ విందుకు ఇంకొక రోజే సమయం ఉంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాల్లో దీనికే అత్యంత హైప్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మళ్ళీ బాహుబలి రోజులే గుర్తొస్తున్నాయి. బాహుబలి, సలార్ రెండు భిన్నమైన చిత్రాలే అయినప్పటికీ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే కాక మరో విషయంలోనూ పోలిక ఉండడం విశేషం.
బాహుబలి లాగే ఇది కూడా రెండు భాగాలుగా తెరకక్కనుండగా.. బాహుబలి-1 లాగే సలార్-1కు కూడా ముగింపులో ఒక కొసమెరుపు ఉండబోతున్న విషయం వెల్లడైంది. స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీలే ఈ విషయాన్ని వెల్లడించాడు.
బాహుబలి ఫస్ట్ పార్ట్ ను బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ముగించడం బాహుబలి-2 కు హైప్ పెంచడానికి ఎంతగా ఉపయోగపడిందో తెలిసిందే. దాదాపు ఇలాగే సలార్ ను కూడా ముగించబోతున్నట్టు ప్రశాంత్ తెలిపాడు. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్ రాబోతున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ను ఒక కొసమెరుపుతో ముగించి తర్వాత ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచడం సహజమే అని.. అలాగే సలార్ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా ఒక హైలెట్ ఉందని ప్రశాంత్ చెప్పాడు.
సినిమాలో మేజర్ హైలైట్ ఏంటి అని సలార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కు దారి తీసేలా వచ్చే ట్విస్ట్ హైలెట్ గా ఉంటుందని.. సలార్-2 చూడాలా వద్దా, అసలు ఎందుకు చూడాలి అనేది అదే డిసైడ్ చేస్తుందని ప్రశాంత్ చెప్పడం ద్వారా క్లైమాక్స్ విషయంలో అభిమానుల్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేశాడు.
This post was last modified on December 21, 2023 10:44 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…