లాక్‍డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో సినిమా హీరోలు గతంలో మాదిరిగా ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా తమను చూడాలని తహతహలాడే ఫాన్స్ తృష్ణ తీరుస్తున్నారు చాలా మంది హీరోలు. మహేష్, చరణ్ ఫోటోలు పెట్టడం తక్కువే అయినా కానీ వారి సతీమణులు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆగస్ట్ 15కి రామ్ చరణ్ చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. పవన్‍కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ కూడా తరచుగా కనబడుతూనే వున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లాక్‍డౌన్ తర్వాత ఫాన్స్కి పూర్తిగా మొహం చాటేసాడు. కనీసం అతని పుట్టినరోజుకి కూడా ఎలాంటి స్పెషల్ వీడియోలు, పోస్టర్లు విడుదల చేయలేదు.
నిత్యం ఎన్టీఆర్ గురించిన వార్తలయితే వస్తున్నాయి, అడపాదడపా అతని ట్విట్టర్‍లో ట్వీట్లు కూడా పడుతున్నాయి కానీ తారక్ ఫోటోలు మాత్రం బయటకు రావడం లేదు. ఎన్టీఆర్ భార్య సోషల్ మీడియాకు దూరంగా వుండడంతో ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు ఎక్కడా దర్శనమివ్వడం లేదు. ఏప్రిల్ 21న ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ వీడియో పెట్టిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కనబడలేదు. ఇంతకాలం తమ హీరో కనిపించకపోవడం కంటే పెద్ద కష్టం అభిమానులకు వుండదు. ఆర్.ఆర్.ఆర్. మొదలు కావడానికి ఇంకా సమయం వుంది కనుక ఫాన్స్ కోసమయినా తారక్ ఒక ఫోటో షేర్ చేస్తే బాగుంటుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates