బాలీవుడ్లో ఎఫైర్లు, బ్రేకప్ లు సర్వసాధారణం. అక్కడ సెలబ్రిటీలు కూడా వీటి గురించి చాలా క్యాజువల్‌గా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోలో చర్చలన్నీ వీటి గురించే ఉంటాయి. ఈ షో పాపులారిటీ కూడా ఇలాంటి టాపిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది.
ఇటీవల ఇదే షోలో తన భర్త రణ్వీర్ సింగ్ పక్కనుండగా దీపికా పదుకొనే తన పాత రిలేషన్‌షిప్స్ గురించి చెప్పిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. దీనివల్ల దీపికతో పాటు కరణ్ జోహార్ సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కొంపలు కూల్చే షో అంటూ కాఫీ విత్ కరణ్ మీద విమర్శల వర్షం కురిసింది. అయితే ఆ వివాదం మీద దీపిక, రణ్వీర్, కరణ్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కాగా ఇప్పుడు కరణ్ జోహార్.. తన షోలో దీపిక-రణ్వీర్ ఎపిసోడ్ మీద విమర్శలు గుప్పించిన వారిపై తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఆ ఎపిసోడ్ ను ట్రోల్ చేసిన వారికి ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. తాజాగా సిద్ధార్థ రాయ్ కపూర్, అర్జున్ కపూర్ పాల్గొన్న ఎపిసోడ్లో కరణ్ మాట్లాడుతూ.. దీపిక-రణ్వీర్ ఎపిసోడ్ ను ది బెస్ట్ గా అభివర్ణించాడు. దీపిక-రణ్వీర్ ఆ ఎపిసోడ్లో చాలా నిజాయితీగా.. ఓపెన్ గా మాట్లాడారని.. వారితో సంభాషణ చక్కగా సాగిందని.. అలాంటి ఎపిసోడ్ మీద ఆ స్థాయిలో ట్రోలింగ్ జరగడం అనూహ్యమని కరణ్ అన్నాడు.
దీపికను విమర్శించిన వాళ్ళందరూ చూసుకోవాలని.. పని పాట లేని వాళ్లే ఇలా చేస్తారని పేర్కొంటూ ట్రోలర్లకు ఆవేశంగా మిడిల్ ఫింగర్ చూపించాడు కరణ్. మామూలుగా విమర్శలను చాలా తేలిగ్గా తీసుకునే కరణ్ ఈ స్థాయిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on December 15, 2023 4:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…