Movie News

బింబిసార 2 గురించి కళ్యాణ్ రామ్ మాట

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసారకు కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు కానీ ఫైనల్ గా దానికి హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇవాళ జరిగిన డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్ మొదలుపెడతామని చెప్పాడు. అయితే దర్శకుడు మారే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఎందుకంటే విశిష్ట పూర్తిగా చిరంజీవి విశ్వంభరతో లాక్ అయిపోయాడు. ఇంకో ఏడాది దాకా దొరికే ఛాన్స్ ఉండదు. భారీ ఫాంటసీ మూవీ కాబట్టి వేరే ప్రాజెక్టు ఒప్పుకోవడానికి స్కోప్ లేదు.

కథ మరి ఎవరిచ్చారనే స్పష్టత రావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే బింబిసార టైంలోనే దర్శకుడితో రెండు కమిట్ మెంట్లు తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. సక్సెస్ మీట్ లలో పరస్పరం ప్రకటనలు కూడా చేసుకున్నారు. కానీ తెరవెనుక ఏం జరిగిందో కానీ వశిష్ట పక్కకు వచ్చేసి మెగా క్యాంపులో చేరిపోయాడు. ఒకవేళ లోగుట్టు ఏం జరగకపోయి ఉంటే సీక్వెల్ కూడా వశిష్ట చేతికే వచ్చేది. ప్రస్తుతం బింబిసార 2 తాలూకు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. డెవిల్ మీద చాలా నమ్మకంగా ఉన్న కళ్యాణ్ రామ్ ప్యాన్ ఇండియా మార్కెట్ ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

మంచి పొటెన్షియల్ ఉన్న బింబిసార లాంటివి రెండు భాగాలు వచ్చినా ఇబ్బందేమీ ఉండదు. కళ్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఈ ఏడాది అమిగోస్ చేస్తే అది దారుణంగా పోయింది. యాక్షన్, కమర్షియల్, మసాలా కన్నా డిఫరెంట్ జానర్స్ ని ఎంచుకుంటేనే మంచి ఫలితాలు వస్తున్నాయని గుర్తించి దానికి తగ్గ కథలనే ఓకే చేస్తున్నాడు. డెవిల్ దర్శకుడి విషయంలో కూడా కాస్త రగడ జరిగింది కానీ ఫైనల్ గా నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడిగా మారిపోయాడు. డిసెంబర్ 29న విడుదల కాబోతున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ తో పాటు దేవర టీజర్ వదిలే సూచనలు ప్రస్తుతానికి లేనట్టే.

This post was last modified on December 12, 2023 9:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago