బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లు దాటేసి వెయ్యి మైలురాయి వైపు పరుగులు పెడుతున్న యానిమల్ ప్రధాన హైలైట్స్ లో ఒకటి ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే వయొలెంట్ ఎపిసోడ్. రన్బీర్ కపూర్ హోటల్ కి దుండగులు మొహాలు కనిపించకుండా స్టీల్ మాస్కులు లాంటివి వేసుకొచ్చి గొడ్డళ్ళతో చంపబోతే, రివర్స్ లో రణ్ విజయ్ సింగ్ అలియాస్ యానిమల్ గోడ మీదున్న అద్దం షో కేసు పగలగొట్టి అందులో నుంచి ఆయుధం తీయడం బాగా పేలింది. అక్కడి నుంచి రక్తపాతం ఏరులై పారుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి అర్జన్ వైలీ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
రిలీజైన పది రోజుల తర్వాత ఈ ఫైట్ ఒరిజినల్ కాదని, మల్లువుడ్ నుంచి స్ఫూర్తి పొందిందని కొందరు వీడియోలతో సహా ప్రూఫ్ బయట పెట్టారు. 2010లో నాయకన్ పేరుతో మలయాళ చిత్రం వచ్చింది. ఇంద్రజిత్ సుకుమారన్ హీరో. కథాకళి కళాకారుడైన తండ్రి ఒక రాజకీయ నాయకుడి హత్యని చూసిన కారణంగా డాన్ చేతిలో కూతురితో సహా ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబానికి, కళకు దూరంగా ఉన్న కొడుకుకి విషయం తెలిసి ప్రతీకారం కోసం వెనక్కు వచ్చి చంపడం మొదలుపెడతాడు. క్లైమాక్స్ లో విలన్ డెన్ కి వెళ్ళినప్పుడు జరిగే పోరాటం అచ్చం యానిమల్ తరహాలోనే ఉంటుంది.
అప్పట్లో నాయకన్ మంచి విజయమే సాధించింది. తెలుగులో డబ్ లేదా రీమేక్ కావడం జరగలేదు. హిందీలోనూ వెళ్ళలేదు. అందుకే ఎవరికీ తెలిసే అవకాశం లేదు. విచిత్రం ఏంటంటే రెండూ సినిమాల్లో తండ్రి మీద జరిగిన దాడులకు కొడుకులు ప్రతీకారం తీర్చుకోవడం కామన్ గా ఉండటం. రెండు పక్కన పెట్టి మరీ పోలికలు చూపుతున్నారు. అయినా నాయకన్ కూడా మరీ ఒరిజినలేం కాదు. హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందిందే. టెక్నాలజీ ప్రపంచంలో ఇవన్నీ మాములే కానీ యాదృచ్చికమో లేక స్ఫూర్తి పొందటమో కారణం ఏదైతేనేం యానిమల్ సునామి ముందు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు.
This post was last modified on December 12, 2023 1:51 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…