తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ క్రమంగా నెమ్మదిస్తోంది. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలు మినహాయించి మిగిలిన సెంటర్లలో వీక్ డేస్ అక్యుపెన్సీలో పెద్ద డ్రాపే కనిపిస్తోంది. ఇప్పుడు కొత్త రిలీజులకు రంగం సిద్ధమయ్యింది. న్యాచురల్ స్టార్ నాని ఎడతెరిపి లేకుండా చేస్తున్న ప్రమోషన్లకు ఎంత వరకు న్యాయం జరగనుందో రేపు తేలనుంది. హాయ్ నాన్న మీద ఫ్యామిలీ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాప సెంటిమెంట్ తో పాటు నాని-మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ, హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం ప్రత్యేక ఆహ్వనితులకు ఏఎంబిలో ప్రీమియర్ వేస్తున్నారు.
బాక్సాఫీస్ సాంప్రదాయానికి భిన్నంగా గురువారంని ఎంచుకున్న హాయ్ నాన్నకు లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. హిట్ టాక్ వస్తే మాత్రం రెండు వారాల పాటు మంచి స్పేస్ దొరుకుతుంది. ఇరవై నాలుగు గంటల గ్యాప్ తో నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ గా రాబోతున్నాడు. మంచి వినోదంతో పాటు హుషారైన డాన్సులు, కామెడీ, యాక్షన్, రాజశేఖర్ పాత్ర ఇలా అన్ని అంశాలు దర్శకుడు వక్కంతం వంశీ పొందుపరిచినట్టు ట్రైలర్ చూశాక అర్థమైపోయింది. థియేటర్ లో చూశాక ఖచ్చితంగా మెచ్చుకుంటారని నితిన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. శ్రీలీల గ్లామర్ ని బాగానే హైలైట్ చేస్తున్నారు.
రెండు విభిన్న జానర్లు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారిపోయింది. ఒకవేళ టాక్ రెండింటికి బాగున్నా ఇబ్బంది లేదు. ఎలాగూ కుటుంబ ప్రేక్షకులు యానిమల్ ని టచ్ చేయలేదు. భగవంత్ కేసరి తర్వాత మళ్ళీ థియేటర్లకు వెళ్లే బొమ్మ దొరకలేదు. సో నాని, నితిన్ లను నిక్షేపంగా వాడుకుంటారు. డిసెంబర్ 15 ఒకటి రెండు చిన్న సినిమాలు తప్ప చెప్పుకోదగ్గవి లేవు. కాబట్టి డంకీ, సలార్ లు వచ్చే దాకా ఎగ్జిబిటర్ల ఫీడింగ్ కి హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు ఉపయోగపడతాయి. ఇవాళ రాత్రికే నాని ఫలితం తెలిసిపోయే అవకాశముండగా నితిన్ టీమ్ ప్రీమియర్ గురించి ఇంకా చెప్పలేదు.
This post was last modified on December 6, 2023 10:46 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…