మాములుగా సీనియర్ స్టార్ హీరోలకు ఒక దశ దాటక వరస ఫ్లాపులు వస్తే నిలదొక్కుకోవడం కష్టం. ఒకవేళ క్యారెక్టర్ ఆర్టిస్టుగానో విలన్ గానో మారినా అవకాశాలు అంత సులభంగా రావు. అయితే అదృష్టం సరైన సమయంలో తలుపు తట్టినప్పుడు ఒక్కసారిగా భాగ్యరేఖలు మారిపోతాయి. డియోల్ బ్రదర్స్ ని చూస్తే అదే అనిపిస్తోంది. సన్నీ డియోల్ కు సోలో హీరోగా కనీసం యావరేజ్ హిట్టు దక్కి దశాబ్దం దాటింది. సాధారణ ప్రేక్షకులు దాదాపు ఆయన్ను మర్చిపోయినంత పని చేశారు. రన్బీర్ కపూర్ లాంటి ఉడుకు రక్తం జమానాలో సన్నీ తెరమరుగు కావడం ఖాయమనే అనుకున్నారు.
కట్ చేస్తే గదర్ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చోటు సంపాదించుకుని ఏకంగా టాప్ 5లో గర్వంగా నిలబడింది. దెబ్బకు నిర్మాతలు సన్నీ డియోల్ ఇంటి ముందు క్యూ కట్టారు. బోర్డర్ సీక్వెల్ కి రంగం సిద్ధమైపోయింది. ఇంకో ఆరేడు ప్రాజెక్టులు అనౌన్స్ మెంట్ కు రెడీ అవుతున్నాయి. ఇక తమ్ముడు బాబీ డియోల్ కి యానిమల్ ఇస్తున్న బ్రేక్ మామూలుది కాదు. మాటలు లేకుండా కేవలం హావభావాలతో కనిపించేది కాసేపే అయినా ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసిన మూడు భార్యల అబ్రార్ గా స్క్రీన్ మీద జీవించేశారు.
దెబ్బకు బాబీ డియోల్ కు అవకాశాల వెల్లువ కురుస్తోంది. యానిమల్ కు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఇతనికి ఇప్పుడు పది కోట్లయినా ఇచ్చేందుకు ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారట. వీళ్ళే కాదు తండ్రి ధర్మేంద్ర సైతం ఈ ఏడాది రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానిలో ముసలి భగ్న ప్రేమికుడిగా ప్రేక్షకులు ప్రేమించేలా నటించడం గమనించాల్సిన విషయం. ఖాన్లు, కపూర్ల ఆధిపత్యంలో ఇప్పుడు డియోల్ అన్నదమ్ములు తిరిగి కంబ్యాక్ కావడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అందుకే పెద్దలంటారూ టైం కలిసి వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరని. ఈ బ్రదర్సే దీనికి సాక్ష్యం.
This post was last modified on December 5, 2023 12:45 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…