Movie News

గుంటూరు కారం పరుగు పెంచాలి

డిసెంబర్ బోణీ యానిమల్ తో గ్రాండ్ గా మొదలైంది. రెండో వారం హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సందడి చేస్తాయి. ఒక ఫ్రైడే పెద్దగా సౌండ్ ఉండదు కానీ ఆపై సలార్, డంకీల దాడితో బాక్సాఫీస్ కు కొత్త జోష్ వస్తుంది. నెలాఖరుకి ప్రస్తుతానికి పెద్ద రిలీజులేవి ప్లాన్ చేయలేదు. సో నెక్స్ట్ అందరి కళ్ళు సంక్రాంతి మీదకు వెళ్తాయి. సరిగ్గా నలభై రోజుల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పండగ బరిలో ఉన్న సినిమాలన్నీ ప్రమోషన్ల స్పీడ్ పెంచే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం మీద అంచనాల గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పటిదాకా వచ్చింది ఒక చిన్న టీజర్, లిరికల్ వీడియో మాత్రమే. మూడు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. ట్రైలర్ కట్ సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూలు గట్రా చూసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది కానీ తమన్ చేతికి కాపీ ఇస్తేనే రీ రికార్డింగ్ వేగమందుకుంటుంది. సెన్సార్ జనవరి మొదటి వారంకల్లా పూర్తి చేసుకుంటే టెన్షన్ ఉండదు. ఇవి కాకుండా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల అగ్రిమెంట్ గట్రా ఉండనే ఉంటాయి. సో చాలా టైట్ షెడ్యూల్స్ లో త్రివిక్రమ్ బృందం పరుగులు పెట్టాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రణాళిక వేస్తున్నారట.

రాబోయే 8వ తేదీ రెండో పాటను విడుదల చేస్తారని టాక్. ఇది మెలోడీ కావొచ్చు. శ్రీలీలతో కలిసి మహేష్ చేసిన ఊర మాస్ డాన్స్ సాంగ్స్ మాత్రం రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్నప్పుడు వదిలి హైప్ ని అమాంతం పెంచే పనిలో ఉన్నారు. ట్రైలర్ ని నూతన సంవత్సర కానుకగా వదిలే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైతే ప్రమోషన్ మెటీరియల్ ని మహేష్, బీడీ, లుంగీ తప్ప ఇంకేదీ రివీల్ చేయలేదు. అంత పెద్ద క్యాస్టింగ్ లో ఒక్క ఆర్టిస్టు రివీల్ కాలేదు. చేతిలో ఉన్న తక్కువ సమయంలో ఇవన్నీ అందుకోవాలి. ఎంత మహేష్ బాబు సినిమానే అయినా ఏ ఒక్కరి పోటీని తక్కువంచన వేయడానికి లేదు.

This post was last modified on December 4, 2023 4:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

7 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

4 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago