నిన్న విడుదలైన యానిమల్ ఓపెనింగ్స్ కళ్లుచెదిరేలా వచ్చాయి. అసలు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఊచకోత చేసిన రన్బీర్ కపూర్, సందీప్ వంగాలు తమ షాకింగ్ అవుట్ ఫుట్ తో యూత్ ని మెప్పించిన విషయం ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే బ్లాక్ బస్టర్ రేంజ్ కి చేరుకుంటుందా లేదానేది ఇప్పుడే చెప్పలేం. ఇవే వసూళ్లు ఒక వారం రోజులు ఏకధాటిగా వచ్చాయంటే మాత్రం సులభంగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి ప్రవేశిస్తుంది.అది సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందనే దాని మీద ఆధారపడింది. వీకెండ్ మాత్రం యానిమల్ ఆధిపత్యమే.
ఇదంతా ఓకే కానీ పాపా మేరీ జాన్(నాన్నా నువ్వే ప్రాణం) పాట లిరికల్ వీడియో చివరిలో రన్బీర్ కపూర్ బాగా మందు తాగేసి తన సిక్కు గ్యాంగ్ చూస్తుండగా సూటు బూటులో విమానంలోని కాక్ పిట్ కి వెళ్లి డ్రైవింగ్ కంట్రోల్ తన చేతిలోకి తీసుకుంటాడు. దానికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరో ఎక్స్ ప్రెషన్లు ఓ రేంజ్ లో పేలాయి. అయితే ఈ షాట్, దానికి సంబంధించిన లింకింగ్ సీన్ సినిమాలో కనిపించలేదు. రన్బీర్ కపూర్ గాయపడి సందర్భాలు సినిమాలు రెండు మూడున్నాయి. ఆ టైంలోనే ఈ విమానం సీన్ ఉండాలి. కానీ మిస్ అయ్యింది. బహుశా ఎడిటింగ్ లో తీసేశారేమో.
ఇంత కిక్ ఇచ్చే సన్నివేశం కత్తెర కోతకు గురైతే అభిమానులు మనోభావాలు గాయపడతాయిగా. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లకు సందీప్ వంగా ఇంకా బయటికి రాలేదు కాబట్టి అప్పుడీ విషయాన్ని ప్రస్తావిస్తే సమాధానం రావొచ్చు. అయినా తాను 3 గంటల 49 నిమిషాల ఫైనల్ కట్ ఇచ్చానని, కానీ ప్రాక్టికల్ సమస్యల వల్ల దాన్ని అరగంట కుదించాల్సి వచ్చిందని దర్శకుడు చెప్పేశాడు కాబట్టి బహుశా పైన చెప్పింది ఈ కారణంగా ఎగిరిపోయి ఉండొచ్చు. ఓటిటి వెర్షన్ మాత్రం మొత్తం వస్తుందట. వైల్డ్ అండ్ బోల్డ్ క్యారెక్టరైజేషన్ తో యానిమల్ చేస్తున్న రచ్చ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉంది.
This post was last modified on December 2, 2023 10:29 am
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…