టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ మొదటి స్థానంలో ఉన్న శ్రీలీలకు క్రమంగా దెబ్బలు తగులుతున్నాయి. భగవంత్ కేసరి ఎంత పెద్ద హిట్ అయినా పెర్ఫార్మన్స్ పరంగా పేరొచ్చింది కానీ డామినేషన్ చేసింది మాత్రం బాలయ్యే. దానికన్నా ముందు స్కంద సూపర్ ఫ్లాప్ అయితే ఇటీవలే ఆదికేశవ మెగా డిజాస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ వచ్చే నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లోనూ రెగ్యులర్ హీరొయిన్ గా కనిపిస్తోంది తప్ప ప్రత్యేకంగా తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉంటారనుకోవడానికి లేదు. ట్రైలర్ చూస్తే కంటెంట్ అలా ఉంది కాబట్టి అధిక శాతం నితిన్ వన్ మ్యాన్ షోనే ఉండొచ్చు.
వీటి సంగతి పక్కనపెడితే గుంటూరు కారం మీద శ్రీలీల ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే విడుదలకు ఇంకో నలభై రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా తన లుక్ ఎలా ఉంటుందో బయట పెట్టలేదు. ప్రమోషన్లన్నీ మహేష్ బాబు బీడీ, పంచె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నొచ్చిన పాటలోనూ హీరోని మాత్రమే హైలైట్ చేశారు. డ్యూయెట్ల చిత్రీకరణ ఇంకా జరగలేదు కానీ తీసిన వరకు సీన్లలో నుంచి ఏదో ఒక లుక్ రిలీజ్ చేయాల్సింది. ఆది ఎలాగూ జరిగే వ్యవహారమే కానీ మహేష్ బాబు గ్లామర్ మీద శ్రీలీల ఆధిపత్యం చెలాయించడం సులభంగా మాత్రం ఉండదు.
తెరమీద మహేష్ ఉంటే ఆడమగ తేడా లేకుండా అందరి చూపు తనవైపే ఉంటుంది. అలాంటిది శ్రీలీల వైపు చూపు తిప్పేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఎలా ప్రెజెంట్ చేసి ఉంటారనేది కీలకం. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్నకు ఇదే సమస్య వచ్చి అంతగా హైలైట్ కాలేకపోయింది. మరి గుంటూరు కారంలో శ్రీలీలకు ఎంత స్కోప్ ఉందనేది రిలీజయ్యాకే తెలుస్తుంది. అయినా రెగ్యులర్ పాత్రలు వేసుకుంటే పోతే మార్కెట్ కి చిల్లు పడుతుందని తనకు మెల్లగా అర్థమవుతోంది. గత నెల రోజుల్లో మునుపటిలా తనకు ఉక్కిరిబిక్కిరి అయ్యే రేంజ్ లో కాల్స్ రావడం లేదట. నితిన్ మహేష్ ఇద్దరిలో ఎవరు బ్రేక్ ఇస్తారో చూడాలి
This post was last modified on November 30, 2023 7:31 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…