గతానికి భిన్నంగా ప్రముఖులు.. సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత జీవితాలు సంచలనాల చుట్టూ.. విషాదాలతో పెనవేసుకుంటున్న వైనాలు ఎక్కువ అవుతున్నాయి. తాజా ఉదంతం కూడా ఈ కోవకు చెందినదే. ఇండియన్ ఐడల్ ఫేమ్.. గాయనిగా సుపరిచితురాలైన 26 ఏళ్ల రేణు ఇప్పుడు ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెబుతున్నారు. ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఆమె తీవ్రంగా కుంగిపోయారని.. ఆమె ఆరోగ్యం విషమంగా మారినట్లు చెబుతున్నారు.
మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంటున్న రేణు.. ఇండియన్ ఐడల్ సీజన్ 10లో ఒక్కసారిగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. కొన్ని యాడ్స్ లో కూడా నటించిన ఆమెకు.. రవి శంకర్ అనే వివాహితుడితో ప్రేమాయణం సాగిస్తున్నారు. జూన్ లో వీరిద్దరు తమ ఇళ్లల్లో నుంచి పారిపోయారు. దీంతో.. రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె కనిపించటం అదేని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని వెనక్కి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలతో విషం తాగిన రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడని తెలిసిన తర్వాత నుంచి రేణు ఆరోగ్యం క్షీణించింది. తాజాగా ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పందుతున్నారు. సంగీతం నేర్చుకునే క్రమంలోనే రేణుకు రవిశంకర్ తో పరిచయమైనట్లు చెబుతున్నారు.
This post was last modified on August 29, 2020 6:57 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…