Movie News

ఇలాంటి రిటైర్మెంట్ ఎవరూ కోరుకోరు

డాడీ, ఆవార్గి, ఆషిఖి, సడక్ లాంటి ఎన్నో మెమొరబుల్ హిట్లు ఇచ్చిన దర్శకుడు మహేష్ భట్. 80లు, 90ల్లో ఆయన ఎన్నో క్లాసిక్స్ తీశారు. అప్పటికి ఇండియాలో ఉణ్న టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా మహేష్‌కు పేరుండేది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. ఐతే 90ల చివరికి వచ్చేసరికి మహేష్ జోరు తగ్గింది. సినిమాలు తీస్తూ పోయాడు కానీ.. ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో మెగా ఫోన్ పక్కన పెట్టేశాడు. 1999లో వచ్చిన ‘కర్టూస్’ ఆయన చివరి చిత్రం.

తర్వాత రెండు దశాబ్దాల్లో స్వీయ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ నిర్మాతగా మాత్రం బోలెడన్ని చిత్రాలు నిర్మించాడు. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాల నేపథ్యంలో వచ్చిన చిత్రాలే ఎక్కువ. మహేష్ భట్ నిర్మాణంలో సినిమా అంటే ఒకే కథ ఉంటుందనే విమర్శలు వచ్చాయి. మధ్య మధ్యలో వేరే జానర్లలోనూ సినిమాలు తీశాడు కానీ.. ఎక్కువ పాపులర్ అయింది ఈ తరహా సినిమాలే.

ఐతే ఎలాంటి సినిమాలు తీస్తేనేం బాక్సాఫీస్ సక్సెసే ముఖ్యం. భట్ సినిమాల్లో చాలా వరకు విజయం సాధించాయి. కానీ నిర్మాతగా కూడా గత కొన్నేళ్లలో ఆయన జోరు తగ్గిపోయింది. వరుస ఫెయిల్యూర్లు ఎదురయ్యాయి. దీంతో మునుపటి స్పీడులో సినిమాలు తీయట్లేదు. ఇక మహేష్ భట్ ప్రస్థానం ముగిసినట్లే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఇలాంటి సమయంలో భట్ చెయ్యకూడని పని ఒకటి చేశాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేయాలని ఆశపడ్డాడు. తన క్లాసిక్ ‘సడక్’కు సీక్వెల్ తీసి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆయన ఆశించినట్లున్నాడు. తన కూతురే అయినా స్టార్ హీరోయిన్ ఆలియాతో పాటు సంజయ్ దత్ లాంటి సీనియర్‌ను, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి మరో యంగ్ స్టార్‌ను పెట్టి ఈ సినిమా తీశాడు. కానీ రాంగ్ టైంలో ఈ సినిమా రిలీజైంది.

సుశాంత్ అనుమానాస్పద మృతి తర్వాత నెపోటిజం బ్యాచ్ అంటేనే జనాలు మండిపోతున్న టైంలో ఈ సినిమా వచ్చింది. దీనికి తోడు మహేష్ కెరీర్లోనే అత్యంత పేలవంగా ఈ సినిమా ఉండటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. దీన్ని మామూలుగా తిట్టిపోయట్లేదు. వాళ్ల కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఐఎండీబీలో ఇప్పటిదాకా ఏ పేరున్న సినిమాలకూ లేని విధంగా 1.1 రేటింగ్ వచ్చింది దీనికి.

ఇలాంటి దారుణమైన సినిమాతో, ఇంత వ్యతిరేకత మూటగట్టుకుని ఇలా బాధాకరమైన వీడ్కోలు తీసుకోవాల్సి వస్తుందని మహేష్ భట్ లాంటి లెజెండరీ డైరెక్టర్ ఊహించి ఉండడు.

This post was last modified on August 29, 2020 4:36 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

1 hour ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

1 hour ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

3 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

4 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

5 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago