ఈ రోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని విషాదంలో ముంచెత్తే వార్త బయటికి వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మన్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచాడన్నదే ఈ వార్త. చాలామందికి అతను క్యాన్సర్ బారిన పడ్డట్లే తెలియదు.
నాలుగేళ్లుగా అతను క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని.. అది బయట పడే సమయానికే మూడో దశ అని.. ఇటీవల నాలుగో దశకు చేరిందని.. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతణ్ని కాపాడలేకపోయారని వెల్లడైంది.
కేవలం 43 ఏళ్ల వయసులో బోస్‌మన్ ఇలా ప్రాణాలు విడవడం అతడి అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ‘బ్లాక్‌పాంథర్’ సహా అనేక సినిమాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఇలా అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడని ఎవరూ ఊహించలేదు.
సాధారణంగా క్యాన్సర్ బారిన పడ్డ వాళ్లు అన్ని పనులూ మానేసి చికిత్స, ఆరోగ్యం మీదే దృష్టిపెడతారు. కానీ బోస్‌మన్ మృత్యువుతో పోరాడుతూనే బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2016లో బోస్‌మన్ పెద్ద పేగులో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
అప్పటికే అది మూడో దశలో ఉంది. ఇక అప్పట్నుంచి అతడికి చికిత్స అందుతోంది. ఐతే బోస్‌మన్ సినిమాలు మాత్రం ఆపేయలేదు. అతడికి ఎంతో పేరు తీసుకొచ్చిన ‘బ్లాక్ పాంథర్’లో నటించాడు. హాలీవుడ్ సూపర్ హీరోల్లో ఒకడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. ఆ చిత్రం రెండేళ్ల కిందట విడుదలైంది.
ఇదే కాక గత నాలుగేళ్లలో అతను మార్షల్, ఎవెంజర్స్:ఇన్ఫినిటీ వార్, ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్, 21 బ్రిడ్జెస్, డా 5 బ్లడ్స్ లాంటి భారీ చిత్రాల్లో నటించాడు. అతను నటించిన చివరి చిత్రం ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలా మృత్యువుతో పోరాడుతూ కూడా సినిమాల్లో అంత ఉత్సాహంగా నటించాడంటే బోస్‌మన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on August 29, 2020 4:04 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…