Movie News

మా అధ్యక్షుడిగా విష్ణు సున్నా- ప్రకాష్ రాజ్

రెండేళ్ల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో తెలిసిందే. సాధారణ ఎన్నికల స్థాయిలో ఇవి చర్చనీయాంశం అయ్యాయి. హోరాహోరీగా సాగిన పోరులో ప్రకాష్ రాజ్ మీద మంచు విష్ణు గెలిచి ‘మా’ అధ్యక్షుడు అయ్యాడు. ఎన్నికల అనంతరం కూడా డ్రామా కొనసాగి.. ప్రకాష్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేయడం.. ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు కార్యవర్గం నుంచి తప్పుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి.

ఆ తర్వాత రెండు వైపుల నుంచి పెద్దగా సౌండ్ లేదు. ‘మా’ కార్యకలపాలపై మీడియాలో కూడా పెద్దగా చర్చ లేదు. కాగా మళ్లీ ‘మా’ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. మంచు విష్ణు మీద ప్రకాష్ రాజ్ ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించడం గమనార్హం. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు పనితీరు సున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘రెండేళ్లు అయిపోయాయి. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే ‘మా’కు ఇప్పటికీ సొంత భవనం లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదు. విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలి. రెండేళ్లలో అతను ఏం చేశాడో చెప్పాలి. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేకపోయాడు. బోగస్ ఓట్లు, అలాగే బయటి నుంచి వచ్చిన చాలామంది ఓట్లు వేయడం వల్ల అతను గెలిచాడు.

కానీ రెండేళ్లలో అతడి పని తీరు సున్నా’’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. వచ్చే ‘మా’ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని.. ఎందుకంటే జాతీయ అంశాలపై తన దృష్టి ఉందని.. వీటన్నింటికీ తోడు సినిమాల పరంగా తనకు చాలా బిజీ షెడ్యూల్ ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. విష్ణు మీద విమర్శలను బట్టి ప్రకాష్ రాజ్ మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తాడని అనిపిస్తోంది కానీ.. తానెంత బిజీనో చెబుతుంటే మాత్రం సందేహాలు కలుగుతున్నాయి.

This post was last modified on November 14, 2023 4:14 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

36 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

55 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

60 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

5 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago