దక్షిణాదిలోనే కాదు జవాన్ తర్వాత ఉత్తరాదిలోనూ డిమాండ్ తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలంటే నిర్మాతలకు అదో సినిమా తీసినంత ప్రహసనంగా కనిపిస్తోంది. పది కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ నేపథ్యంలో అంత ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రొడ్యూసర్లు చాలా ఉన్నారు. ఇంతా చేసి పక్కా ప్లానింగ్ ప్రకారం అతని దగ్గర ట్యూన్లు తీసుకోవడం, బీజీఎమ్ చేయించుకోవడం సులభం కాదు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన దేవరకు ఇంకా పాటలు ఇచ్చాడో లేదో తెలియదు. దర్శకుడు కొరటాల శివ వెంటపడాల్సిన ఒత్తిడి మొదలైంది.
తమిళ సినిమాలతోనే ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న అనిరుధ్ కి ఒక్క దర్శకుడు మాత్రం బాగా సింక్ అవుతున్నాడు. అతను అడిగితే చాలు నో అనకుండా టైంకు పని చేసి పెడుతున్నాడు. అతనే గౌతమ్ తిన్ననూరి. వీళ్ళ కలయికలో నాని జెర్సీ వచ్చింది. అదెంత ఎమోషనల్ సూపర్ హిట్టో మళ్ళీ చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ 12 కోసం మళ్ళీ చేతులు కలిపారు. ఇది కొంత ఆలస్యం అవుతుండటంతో గౌతమ్ ఈలోగా టీనేజ్ లవ్ స్టోరీ ఒకటి తీసేస్తున్నాడు. పొన్నియిన్ సెల్వన్ లో నటించిన సారా అర్జున్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ టచ్ తో రూపొందనుంది.
దీనికీ అనిరుద్ రవిచందరే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఒకపక్క స్టార్ హీరోలు సైతం వెయిటింగ్ లో ఉంటే కేవలం గౌతమ్ అడిగాడన్న కారణంతోనే ఒక మీడియం బడ్జెట్ మూవీకి సైతం స్కోర్ ఇవ్వడానికి రెడీ అవ్వడం చూస్తే ఇద్దరి మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గౌతమ్ కాకుండా వేరొకరు అడిగి ఉంటే ఒప్పుకునేవాడు కాదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. జెర్సీ నుంచి సింక్ అలా కుదిరింది మరి. ఇండియన్ రెండు భాగాలు, రజనీకాంత్ రెండు సినిమాలు, అజిత్ మూవీతో చాలా బిజీగా ఉన్న అనిరుధ్ ని అంత తేలిగ్గా ఒప్పించుకోవడంలో గౌతమ్ ఫాలో అయ్యే సీక్రెట్ ఏంటో.
This post was last modified on November 9, 2023 1:13 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…