Movie News

తమన్ పాటలే ఎందుకు లీకవుతున్నాయి

నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాల లీకులు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం గేమ్ ఛేంజర్ పాట ఆన్ లైన్ లో చేసిన రాద్ధాంతం చూశాం. ఎస్విసి లాంటి బ్యానర్ కంటెంట్ అంటే చాలా సెక్యూరిటీతో ఉంటుంది. అలాంటి సంస్థ నుంచే సాంగ్ బయటికి రావడం ఊహించని పరిణామం. దెబ్బకు ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియకపోయినా దీపావళికి పాటని వదలాల్సి వస్తోంది. తాజాగా నిన్న సాయంత్రం గుంటూరు కారం వంతు వచ్చింది. ఆడియో స్పష్టంగా లేకపోయినా లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ విని ఈజీగా అది మహేష్ బాబుదేనని అందరికీ అర్థమైపోయింది.

సర్కారు వారి పాట టైంలోనూ కళావతి కళావతి అచ్చం ఇలాగే ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ తమన్ స్వరపరిచినవి. షూటింగ్ జరుగుతున్న టైంలో విపరీతమైన హైప్ నెలకొన్నవి. వందల కోట్ల పెట్టుబడులను భుజాల మీద మోస్తున్నవి. ప్రత్యేకంగా అతన్నే టార్గెట్ చేస్తున్నారా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కుట్ర చేశారాని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిమిషాల్లో అలెర్ట్ అయిపోయి అదే పనిగా వైరల్ చేస్తున్న ట్విట్టర్ హ్యాండిల్స్ ని గుర్తించి లీగల్ చర్యలకు సైతం వెనుకాడటం లేదు.

జరిగినదాన్ని ఎలాగూ ఆపలేం కానీ కనీసం ఇప్పుడైనా ఇలాంటివి జరగకుండా నిర్మాతలు జాగ్రత్త పడాలి.రాబోయే రోజుల్లో తెలుగు నుంచి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూలో ఉన్నాయి. డిసెంబర్ సలార్ తో మొదలుపెట్టి ఆగస్ట్ లో పుష్ప 2 దాకా బోలెడు దండయాత్ర చేయబోతున్నాయి. లీకులు చిన్నవో పెద్దవో అభిమానుల ఎగ్జైట్ మెంట్ నే కాదు కోట్లు పోసి కొన్న ఆడియో కంపెనీల ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. అసలు టెక్నికల్ టీమ్ దగ్గర మాత్రమే ఉండే కంటెంట్ ఎలా బయటికి వస్తుందో పోస్ట్ మార్టం చేయాల్సిందే. ముందుగా అలెర్ట్ అవ్వాల్సింది తమనే. తనకూ నష్టమే కాబట్టి. 

This post was last modified on November 4, 2023 12:02 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago