క్రేజీ రైడ్‍ గ్యారెంటీ: సమంత

‘ది ఫ్యామిలీ మ్యాన్‍’ సీజన్‍ 2తో సమంత ఓటిటి ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ఇంతకుముందు పాన్‍ ఇండియా ప్రాజెక్టులేవీ చేయని సమంత ఈ హిట్‍ వెబ్‍ సిరీస్‍లో ఒక విలక్షణమైన పాత్ర పోషించింది. ఆమె పాత్ర నెగెటివ్‍ షేడ్స్ తో వుంటుందని మొదట్నుంచీ ప్రచారంలో వుంది. ఈ సిరీస్‍ కోసం సమంత అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుండగా, ఆ రోజు త్వరలోనే రానుందని సమంత హింట్‍ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్‍ 2 డబ్బింగ్‍ వర్క్ స్టార్ట్ అయింది.

సమంత ఇందుకోసం డబ్బింగ్‍ చెప్పే పనిలో వుంది. డబ్బింగ్‍ సూట్‍ నుంచి అప్‍డేట్‍ ఇస్తూ ‘మీరంతా ఒక క్రేజీ రైడ్‍కి సిద్ధంకండి’ అని చెప్పింది. సమంత ఇలా రిలీజ్‍కి ముందే ఎక్సయిట్‍ అయిన ప్రాజెక్టుల్లో చాలా వరకు సక్సెస్‍ అయ్యాయి. చూస్తోంటే ఈ సీజన్‍ మొదటి సీజన్‍ కంటే ఎక్కువగా క్లిక్‍ అవుతుందని అనిపిస్తోంది. మనోజ్‍ బాజ్‍పేయి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సీజన్‍ అమెజాన్‍ ప్రైమ్‍లో స్ట్రీమ్‍ అవుతుంది. ఇంకా ఈ సీజన్‍ రిలీజ్‍ డేట్‍ ఏమిటనేది అధికారికంగా ప్రకటించలేదు కానీ అక్టోబర్‍ నుంచి స్ట్రీమ్‍ అయ్యే ఛాన్సెస్‍ కనిపిస్తున్నాయి.