దసరా పోటీలో విజేతగా నిలిచిన భగవంత్ కేసరి మొదటి స్థానం అందుకుంటే బ్రేక్ ఈవెన్, లాభాల పరంగా లియో సక్సెస్ ఫుల్ మూవీగా హిట్టు దక్కించుకుంది. బిజినెస్ కోణంలో రెండింటి రేంజ్ కి సంబంధం లేకపోయినా థియేటర్ల ఫుల్ లో పరస్పరం గట్టి ప్రభావం చూపించుకున్నాయి. కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రెండు విడుదల కావడంతో ఈ పరిణామం తప్పలేదు. ఇప్పుడు ఓటిటిలోనూ అచ్చం అదే విధంగా తలపడతాయని సమాచారం. బాలయ్య మూవీని నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ ప్రాథమికంగా నిర్ణయించినట్టు అంతర్గత వర్గాల సమాచారం
అప్పటికి నెల రోజుల రన్ దాటిపోయి ఉంటుంది కాబట్టి నాలుగు వారాల అగ్రిమెంట్ కి న్యాయం జరిగినట్టే. ఇక లియో నెట్ ఫ్లిక్స్ చేతిలో ఉంది. ఇన్ సైడ్ టాక్ బట్టి చూస్తే నవంబర్ 20 లేదా 22 రెండు ఆప్షన్స్ చూస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఏడాది హిట్ల కంటే డిజాస్టర్లను ఎక్కువగా కొన్న నెట్ ఫ్లిక్స్ కి దసరా లాంటి ఒకటి రెండు మినహాయించి అన్నీ ఫ్లాప్ సినిమాలే దక్కాయి. అయితే జవాన్ లాంటి వెయ్యి కోట్ల మూవీ చేతిలో ఉండటం బంగారు బాతు అయ్యింది. నాని దసరా భారీ వ్యూస్ తెచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఖుషిలు మంచి స్పందన దక్కించుకున్నాయి. కానీ లియో రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది.
అన్నట్టు భగవంత్ కేసరి తెలుగుకే పరిమితం చేయకుండా ఇతర భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు పెడతారని తెలిసింది. బాలయ్య, శ్రీలీల ఎమోషనల్ కాంబో గురించి ఆన్ లైన్ లో చూసి తెలుసుకున్న ఇతర బాషల నెటిజెన్లు దీన్ని ఓటిటిలో చూసేందుకు రెడీ అవుతున్నారు. సో అతి తక్కువ గ్యాప్ లో బాలకృష్ణ, విజయ్ సినిమాలు కనువిందు చేయబోతున్నాయన్న మాట. మరి టైగర్ నాగేశ్వరరావు మాటేమిటి అనుకుంటున్నారా. వీటికన్నా ఓ రెండు వారాలు ముందే వచ్చేలా కాస్త ఎక్కువ రేట్ కి నిర్మాత అడిగినట్టు తెలిసింది. ఆ డీల్ ఓకే అయితే ప్రైమ్ లోనే మాస్ మహారాజాను త్వరగా చూడొచ్చు.
This post was last modified on November 1, 2023 7:40 pm
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…