మాములుగా ఏ దర్శకుడైనా ఇండస్ట్రీకి తనను తాను ప్రూవ్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటాడు. అందులోనూ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పుడు ఆ కిక్ వేరుగా ఉంటుంది. కానీ కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వ్యక్తే అల్ఫోన్స్ పుత్రేన్. మనకు అంతగా పరిచయం లేదు కానీ మళయాలంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమమ్ ని అత్యద్భుతంగా మలిచింది ఇతనే. తెలుగులో నాగ చైతన్య ఏరికోరి మరీ చందూ మొండేటి దర్శకత్వంలో రీమేక్ చేశాడు. ఒరిజినల్ అంత గొప్ప సక్సెస్ అందుకోలేదు కానీ మంచి హిట్టేనని చెప్పాలి.
ఇతనిప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కారణం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. అంటే ఇది మానసిక సమస్యలతో బాధ పడే వాళ్లకు వచ్చే జబ్బు. ఇది వచ్చినప్పుడు స్థిమితంగా ఆలోచించరు. ప్రతిదాని గురించి విపరీతంగా ఆలోచిస్తారు. నలుగురితో కలిసి మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఫీలవ్వడం, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు. గత ఏడాది నయనతార, పృథ్విరాజ్ సుకుమారన్ లతో గోల్డ్ తీశాడు. ఇది దారుణంగా పోయింది. ఆ మాత్రం దానికే రివ్యూయర్లు మీద విరుచుకుపడి ప్రేక్షకుల మీద కూడా నానా రకాల కామెంట్లు చేశాడు.
కెరీర్ మొత్తంలో తీసింది మూడు సినిమాలే. ప్రేమమ్, గోల్డ్ కాకుండా నేరమ్ అని మరొకటి ఉంది. ఒక యాంతాలజిలో భాగం పంచుకున్నాడు. ఇకపై థియేటర్ కంటెంట్ కి దూరంగా ఉంటానని, ఓటిటి, యూట్యూబ్ కోసం మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తానని చెప్పిన అల్ఫోన్స్ పుత్రేన్ లాంటి యంగ్ ఫిలిం మేకర్ 39 ఏళ్ళ వయసుకే ఇలా సెలవు చెప్పడం విచారకరం. ఒకవేళ కోలుకున్నాక తిరిగి వస్తాడేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ అతను మాత్రం దేవుడిచ్చిన ట్విస్టుకి నేనేం చేయలేనంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తూ ఫైనల్ గా కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశాడు.
This post was last modified on October 30, 2023 10:49 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…