Movie News

ఫైర్ బ్రాండ్ కంగనాకు ఇలాంటి పరిస్థితా

తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడిన హీరోయిన్ కంగనా రౌనత్ కు మంచి నటిగా పేరుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు తనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యే దర్శకులకు లోటే లేదు. క్వీన్ లాంటి మూవీస్ ని తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టిన ఘనతలు తనకు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడంతా రివర్స్ లో నడుస్తోంది. కంగనా సోలోగా నటించిన చిత్రం ఏదైనా సరే కనీస ఓపెనింగ్స్ కి నోచుకోవడం లేదు. ఇవాళ తేజస్ రిలీజయ్యింది. మల్టీప్లెక్సుల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే దేశం మొత్తం మీద పట్టుమని నాలుగు వేల టికెట్లు అమ్ముడు కాకపోవడం విషాదం.

ఈ ఏడాది అత్యంత పెద్ద డిజాస్టర్స్ లో మొదటి స్థానం దక్కించుకున్న గణపథ్ కంటే అన్యాయంగా తేజస్ పెర్ఫార్మ్ చేయడం ఇంకో ట్రాజెడీ. టైగర్ శ్రోఫ్ మొదటి రోజు కనీసం ఓ రెండున్నర కోట్లు తెస్తే కంగనా కనీసం కోటిన్నరకే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికన్నా ముందు వచ్చిన ధాఖడ్, తలైవి, పంగా, జడ్జ్ మెంటల్ హై క్యా, రంగూన్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఈమెనే నమ్ముకుని పి వాసు చంద్రముఖి 2 తీస్తే అన్ని భాషల్లో పరుగులు పెట్టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ విడుదలకు పలు అడ్డంకులు వస్తున్నాయి. డేట్ ఫైనల్ కాలేదు.

ఇంత బ్యాడ్ ఫామ్ ఉండటం ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ కు ఇబ్బంది కలిగించేదే. ఇకపై మార్కెట్ లో తన సినిమాలకు పెట్టుబడులు కష్టమే. గత కొన్నేళ్లలో ఒక్క మణికర్ణిక మాత్రమే డీసెంట్ సక్సెస్ అందుకుంది. అది కూడా దర్శకుడు క్రిష్ నుంచి బాధ్యతలు తీసుకుని తనే స్వయంగా డైరెక్ట్ చేసుకుని వివాదాలు రేపడం ఎవరూ మర్చిపోలేదు. బాలీవుడ్ విశ్లేషకులు మాత్రం కంగనా కెరీర్ ముగింపులో ఉందని, దగ్గర్లో పెద్ద బ్రేక్ దొరకడం కష్టమేనని తేల్చేస్తున్నారు. ఇంతా జరిగి తేజస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తే ఊరట అనుకోవచ్చు. టాక్ చాలా బ్యాడ్ గా ఉండటం ఇంకో ఝలక్ ఇచ్చేలా ఉంది. 

This post was last modified on October 27, 2023 2:31 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

22 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

51 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago