విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన లియో మొదటి వారం పూర్తి చేసుకున్నాక దాని హిట్ రేంజ్ ఏంటో అర్థం కాక ఇతర రాష్ట్రాల బయ్యర్ల బుర్రలు వేడెక్కిపోతున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ వరకు చూసుకుంటే 16 కోట్లకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ కు గాను లియో ఇప్పటిదాకా 22 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అంటే ఫస్ట్ వీక్ కే అయిదు కోట్లకు పైగా లాభం వచ్చినట్టు. టాక్ డివైడ్ గా ఉన్నా సరే నలభై కోట్ల గ్రాస్ రాబట్టడమంటే మాటలు కాదు. సో పెట్టుబడి రాబడి కోణంలో చూసుకుంటే లియో తెలుగు ఖచ్చితంగా హిట్టు కిందకే వస్తుంది. రెండో వారం కూడా డీసెంట్ రన్ దక్కేలా ఉంది.
ఇక తమిళ సంగతి చూస్తే ఎలాగైనా జైలర్ ని దాటినట్టు ఋజువు చేయాలనే తాపత్రయంలో నిర్మాతలు ఎక్కువ ఫిగర్లను పోస్టర్లలో ప్రమోట్ చేస్తున్నారని పలు వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. లియో స్కామ్ పేరుతో దీని మీద సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా జరిగింది. నిజానికి జైలర్ రేంజ్ లో లియోకి భీభత్సమైన టాక్ రాలేదన్నది వాస్తవం. మొదటి మూడు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల వసూళ్లు భారీగా కనిపించాయి కానీ తర్వాత మెల్లగా నెమ్మదించడం మొదలైంది. హిందీలో మల్టీప్లెక్సులు సహకరించకపోవడం వల్ల పరిమిత స్క్రీన్లు దొరకడంతో అసలు స్టేటస్ ఇంకా తెలియలేదు.
ఇప్పుడు లియో పెట్టుకున్న టార్గెట్ 600 కోట్ల గ్రాస్ ని దాటడం. విశ్లేషకులు మాత్రం ఇది అసాధ్యం అంటున్నారు. విజయ్ కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి గత రికార్డులన్నీ బద్దలయ్యాయనే రేంజ్ లో ఇంతగా పబ్లిసిటీ చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత 80 శాతం షేర్ తీసుకునేలా ఒత్తిడి చేసి అగ్రిమెంట్ రాసుకున్నారని, అంతకంతా వస్తుందని నమ్మితే ఇప్పుడు రెండో వారంలో నెమ్మదించడం తమకు నష్టాలు మిగిలేలా ఉన్నాయని చెప్పిన వీడియోలు వైరలవుతున్నాయి. అక్కడి సంగతి పక్కనపెడితే లియో ఏపీ తెలంగాణ వరకు సితార సంస్థకు ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచింది.
This post was last modified on October 26, 2023 9:14 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…