న్యాచురల్ స్టార్ నాని 31వ సినిమా అధికారికంగా ప్రకటించారు. సరిపోదా శనివారం టైటిల్ మొన్నే లీకైనా ఏమైనా మార్పు ఉండొచ్చేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా అదే అనౌన్స్ చేశారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండా ప్రత్యేకంగా రెండు నిమిషాల టీజర్ కోసమే స్పెషల్ షూట్ చేయడం విశేషం. ఆ మధ్య నాగార్జున నా సామి రంగా నుంచి ఇదో కొత్త ట్రెండ్ గా మారుతోంది. డివివి దానయ్య నిర్మాతగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ ని ఎక్కువ రివీల్ కాకుండా టీజర్ ని కట్ చేసి సస్పెన్స్ లో ఉంచారు.
జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప రోజు వస్తుంది. దాన్ని పెద్దవాళ్ళు ఒకరకంగా చెబితే ఇప్పటి తరం ఇంకోలా మార్చేసి ఆ డేట్ వచ్చే దాకా మూసుకుని ఉండమని చెబుతారు. ఒక్కసారిగా మలుపు తిప్పే దాని కోసం ఎదురు చూడటం అందరూ చేసేదే. అయితే అలాంటి రోజు ప్రతి శనివారం ఒకడికి వస్తే దాన్నేమంటారు. వెరైటీగా ఉంది కదా. ఓ పాడుబడిన షెడ్డు లాంటి చోట కాళ్లకు సంకెళ్లతో బంధింపబడి ఉన్న ఓ యువకుడు వాటిని పీఠకత్తితో తెంచుకుని బయటికి వస్తాడు. తన కోసం ఎదురు చూస్తున్న ఊరి జనం ముందు ప్రత్యక్షమవుతాడు. అసలేం జరిగిందో తెలియాలంటే ఆగాలి.
దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా విభిన్నంగా టీజర్ ని ప్రెజెంట్ చేశాడు. ఏదో ఊరికి సంబంధించిన ట్విస్టు, ప్రతి శనివారం నాని జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పు చుట్టూ డిఫరెంట్ పాయింట్ అయితే రాసుకున్న క్లారిటీ వచ్చేసింది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సరిపోలేదా శనివారంకు జెక్స్ బెజోయ్ సంగీతం, జి మురళి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మెయిన్ విలన్ గా ఎస్జె సూర్యని నిన్నే ప్రకటించారు. క్వాలిటీ క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న సరిపోదా శనివారం ప్రస్తుతం నాని చేస్తున్న హాయ్ నాన్నకు పూర్తిగా డిఫరెంట్ జానర్ లో రానుంది.
This post was last modified on October 23, 2023 1:40 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…