పక్కా ప్లానింగ్ తో వేగంగా సినిమాలు చేస్తూ ఏడాదికి కనీసం రెండు మూడు థియేటర్ రిలీజ్ ఉండేలా చూసుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని తన 31వ మూవీని లాంచ్ చేయబోతున్నాడు. డివివి దానయ్య నిర్మించబోయే ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తాడు. ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో గత ఏడాది అంటే సుందరికి వచ్చింది. కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకోలేదు కానీ కంటెంట్ పరంగా అభిమానులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి సంతృప్తినిచ్చింది. లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి వచ్చాక ఎక్కువ ఆదరణ దక్కింది.
ఇప్పుడీ నాని 31ని డిఫరెంట్ జానర్ లో చేయబోతున్నట్టు సమాచారం. టైటిల్ గా ‘సరిపోదా శనివారం’ని ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఎల్లుండి ప్రకటించి 24న పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా షూటింగ్ మొదలుపెడతారు. దీని కోసమే నాని ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. హాయ్ నాన్న పూర్తయిపోవడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు మంచి యాక్షన్ డోస్ ఉంటుందని వినికిడి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి ఇలా మూడు సినిమాలు సాఫ్ట్ జానర్ డీల్ చేసిన వివేక్ ఈసారి రూటు మార్చబోతున్నాడు.
అంటే సుందరానికి టైంలో ఎన్ని కామెంట్స్ వచ్చినా నానికి వివేక్ ఆత్రేయ మీద గురి తగ్గలేదు. అందుకే ఈ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. విలన్ గా ఎస్జె సూర్యని భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నారనే టాక్ కూడా ఉంది. అఫీషియల్ డీటెయిల్స్ అన్నీ రేపు రాబోతున్నాయి . హీరోయిన్ ఎవరో ఇంకా గుట్టుగానే ఉంది. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటూ అన్ని భాషల్లో విడుదలయ్యేలా ప్యాన్ ఇండియా సబ్జెక్టులు ఎంచుకుంటున్న నానికి హాయ్ నాన్న ఫలితం కీలకం కాబోతోంది. వచ్చే నెల మూడో వారం ఉంచి దాని ప్రమోషన్లు వేగవంతం చేయబోతున్నారు.
This post was last modified on October 21, 2023 12:40 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…