పఠాన్,జవాన్, టైగర్ 3 తర్వాత బాలీవుడ్ లో మళ్ళీ అంతే అంచనాలున్న సినిమా అనిమల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడంతో ఇతర భాషల్లోనూ దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ బ్రాండ్ బాగా పని చేస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ చూశాక ఒక్కసారిగా బిజినెస్ వర్గాల్లో హైప్ వచ్చేసింది. ముందు సౌమ్యుడిగా ఉంటూ తర్వాత తండ్రి కోసం మరణ శాసనాలు రాసే గ్యాంగ్ స్టర్ గా మారిపోయే క్రమాన్ని సందీప్ ఇంటెన్స్ గా తెరకెక్కించాడనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది. అయితే కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకున్నారనే కామెంట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
బాగా వైరలైన సీన్లలో రన్బీర్ కపూర్, రష్మిక మందన్నను ఫ్లైట్ కాక్ పిట్ లో లిప్ లాక్ కిస్ చేసుకోవడం ఒకటి. ఇది ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఫిఫ్టీ షేడ్స్ అఫ్ గ్రేలో హెలికాఫ్టర్ సన్నివేశం లాగే ఉందని నెటిజెన్లు ఉదాహరణగా చెబుతున్నారు. తడిసిన చొక్కాతో చేతిలో చిన్న గొడ్డలి పట్టుకుని హీరో చేసే ఊచకోత కూడా కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్ నుంచి తీసుకున్నదని పోలికలు చూపిస్తున్నారు. నిజానికి ఇలాంటి మాఫియా కథలు అన్నింటికి రెఫెరెన్స్ బుక్ లాగా ఫ్రాన్సిస్ కొప్పుల గాడ్ ఫాదర్. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సక్సెస్ ఫుల్ బ్లాక్ బస్టర్లు వచ్చాయో చెప్పడం కష్టం.
కాబట్టి అనిమల్ లో కేవలం కొన్ని సెకండ్ల ఫుటేజ్ చూసి వెంటనే ఒక నిర్ధారణకు రాలేం. కబీర్ సింగ్ టైంలో కేవలం సౌత్ డైరెక్టరనే ఉద్దేశంతో ఆ సినిమాని చాలా నెగటివ్ గా రివ్యూ చేసిన కొందరు ముంబై మీడియా ప్రముఖులు ఆ తర్వాత దానికి వచ్చిన రెండు వందల కోట్ల వసూళ్లు చూసి సైలెంట్ అయిపోయారు. అది చూసే టి సిరీస్ ఇంత భారీ బడ్జెట్ తో అనిమల్ తీసే ఛాన్స్ ఇచ్చింది. ఇది రిలీజ్ అయ్యాక ప్రభాస్ స్పిరిట్ తాలూకు స్క్రిప్ట్ పనులు మొదలుకాబోతున్నాయి. ఆ తర్వాత మహేష్ బాబు, చిరంజీవి, షారుఖ్ ఖాన్ లలో ఒకరితో ప్రాజెక్టు లాక్ అయ్యే ఛాన్స్ ఉందని వినికిడి.
This post was last modified on October 18, 2023 7:07 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…