మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం, చాలా గ్యాప్ తర్వాత యువి సంస్థకు మంచి లాభాలు రావడం జరిగిపోయాయి. థియేట్రికల్ రన్ పూర్తయిపోయి నిన్న వారం నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ కు ముందు, తర్వాత కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ దేశ విదేశాలు తిరిగి పబ్లిసిటీ భారాన్ని మొత్తం ఒక్కడే మోసిన నవీన్ పోలిశెట్టి అక్కడితో ఆగలేదు. ఓటిటిలో చూసేందుకు ప్రేక్షకులను ప్రోత్సహించడానికి తన వంతుగా వీడియో ట్వీట్లు పెడుతున్నాడు. అందులో భాగంగా ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ని అచ్చుగుద్దినట్టు ఇమిటేట్ చేసి వావ్ అనిపించుకున్నాడు.
యూట్యూబ్ లో లక్షలాది ఫాలోయర్స్ ఉన్న అన్వేష్ చిన్ని అనే వ్యక్తి ప్రపంచం మొత్తం రౌండ్లు కొడుతూ మారుమూల దేశాల వీడియోలు అక్కడి పద్ధతులు, ఆహారపు అలవాట్లు తదితర వీడియోలు రెగ్యులర్ గా పెడుతుంటాడు. వీటికి వచ్చే వ్యూస్ ద్వారా నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని సంపాదించుకోవడం ఆన్లైన్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు తెలిసిన విషయమే. ఇతని మాటలు, చెప్పే విధానం చాలా వెరైటీగా ఉంటాయి. సదరు అన్వేష్ ని అచ్చుగుద్దినట్టు దింపేశాడు నవీన్ పోలిశెట్టి. అతని వైరల్ వీడియో ఒకటి తీసుకుని తన సినిమా కాన్సెప్ట్ కి ముడిపెట్టి ఓ రేంజ్ లో నవ్వించేశాడు.
ఇందుకేగా నవీన్ నిన్ను ఇష్టపడేది అంటూ నెటిజెన్లు కామెంట్ల ద్వారా అభినందనలు చెబుతున్నారు. మిమిక్రీ లాంటి యునీక్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలకు ఎంత ప్లస్ పాయింటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా రెండు వారాలు దాటగానే టీమ్ మొత్తం సైలెంట్ అయిపోతున్న ట్రెండ్ లో యాభై రోజులు పూర్తి చేసుకుని, డిజిటల్ లో అందుబాటులో ఉన్నా కూడా ఇంకా చూడండంటూ ప్రచారం చేయడం నవీన్ ఎంత కష్టపడుతున్నాడో తేటతెల్లం చేస్తుంది. చూస్తుంటే శాటిలైట్ ప్రీమియర్ జరిగే దాకా ఈ బాధ్యత నుంచి నవీన్ తప్పుకునేలా కనిపించడం లేదు.
This post was last modified on October 15, 2023 5:57 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…