సరిగ్గా ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోయే భగవంత్ కేసరి కోసం నందమూరి అభిమానుల ఎదురు చూపులు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. కమర్షియల్ అంశాలు పెడుతూనే రెగ్యులర్ హీరోయిన్ డ్యూయెట్లకు దూరంగా ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలైట్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి మంచి కంటెంట్ తో రూపొందించినట్టు ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చేశారు. వయసు మళ్ళిన క్యారెక్టర్ లో బాలయ్య కనిపిస్తున్నా ఫ్లాష్ బ్యాక్ తో సహా ఇందులో ఊహించని సర్ప్రైజులు చాలా ఉంటాయని టీమ్ ఊరిస్తోంది. ఫ్యాన్స్ ఊహించని మరో ట్విస్టు మొదటి వారం దాచి పెడుతున్నారు.
ఆల్ టైం ఎవర్ గ్రీన్ క్లాసిక్ మంగమ్మ గారి మనవడులో దంచవే మేనత్త కూతురా పాట రీమిక్స్ ని స్పెషల్ గా మొదటి వారం చివర్లో దసరా పండగ కానుకగా థియేటర్లలో జోడించబోతున్నారు. ముందుగా చూసే ఆడియన్స్ కి ఒరిజినల్ ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఆలోచన చేశామని, రెండోసారి వెళ్ళినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ పాట ఉపయోగపడుతుందని అనిల్ చెబుతున్నారు. ఐడియా బాగానే ఉంది. ఎలాగూ హిట్ టాక్ వస్తే ఫ్యాన్స్ రెండు మూడు సార్లు ఈజీగా చూస్తారు. అలాంటిది దంచవే లాంటి ఛార్ట్ బస్టర్ సాంగ్ ని మళ్ళీ బోనస్ గా ఇస్తామంటే వెళ్లకుండా ఊరుకుంటారా.
పోటీ సంగతి ఎలా ఉన్నా భగవంత్ కేసరి మీద మాస్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. కెరీర్లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి గత సినిమాల కన్నా బెస్ట్ దీనికి ఇచ్చాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. విజయదశమికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదే అవుతుందన్న నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. శ్రీలీల సెంటిమెంట్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చెన్నకేశవరెడ్డిని తలపించేలా బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇవన్నీ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. అక్టోబర్ 19న తెల్లవారుఝాము నుంచి షోలు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అనుమతులు రావాలి.
This post was last modified on October 13, 2023 10:54 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…