ఏజెంట్ ఫలితం అఖిల్ ని బాగా డిఫెన్స్ లో పడేసింది. ఒకవేళ యావరేజ్ అయినా ఈపాటికి కొత్త సినిమా మొదలుపెట్టేవాడేమో కానీ దాని దెబ్బకు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ దర్శకుడిగా ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్న సంగతి వేసవి ముందే లీక్ అయ్యింది. కానీ ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టలేదు. ఉంటుందా ఉండదా అనే డౌట్ అక్కర్లేదు. కన్ఫర్మ్ అయ్యింది కానీ స్క్రిప్ట్ కి సంబంధించిన ఏవో కీలక మార్పుల వల్ల కొంత లేటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది. విరూపాక్ష రూపంలో డెబ్యూ తోనే బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు ఈ మద్యే అఖిల్ కి ఒక లైన్ చెప్పాడని సమాచారం. అయితే కేవలం ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా నిర్ధారణ కాలేదు. ముందు విరూపాక్ష 2 పూర్తి చేయాలి. అఫీషియల్ గా ప్రకటించినా హీరో ఎవరో ఫైనల్ కాలేదు. సాయి ధరమ్ తేజ్ చేసే పరిస్థితిలో లేడు. ఆరేడు నెలలు విశ్రాంతి తీసుకుని తర్వాత కథలు వినాలని డిసైడయ్యాడు. అప్పటిదాకా కార్తీక్ వెయిట్ చేయడం ఇబ్బందే. అందుకే తన స్థానంలో విరూపాక్ష 2ని అఖిల్ తో చేసే ఆలోచన ఏమైనా జరుగుతుందేమో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
వీలైనంత త్వరగా అఖిల్ ఏదో ఒకటి మొదలు పెట్టడం అవసరం. నాగార్జున నా సామీ రంగాలో బిజీ అయ్యారు. నాగ చైతన్య దర్శకుడు చందూ మొండేటి కోసం ప్రీ ప్రొడక్షన్ లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడు. సుమంత్, సుశాంత్ లు సైతం చేతిలో ఒకటి రెండు సినిమాలు, తమ దగ్గరికి వస్తున్న దర్శకులు దేనికీ నో చెప్పడం లేదు. ఏజెంట్ పోయింది. అఖిల్ ఒక్కడికే కాదు టాలీవుడ్ లో ఉన్న ప్రతి స్టార్ హీరోకి అలాంటి డిజాస్టర్లు బోలెడున్నాయి. అలాంటప్పుడు మరీ ఎక్కువ ఆత్మపరీశీలన చేసుకోవాల్సిన అవసరం లేదు. లేనిపోని ప్రచారాలకు చెక్ పడాలంటే కింగ్ రెండో వారసుడు పరుగులు పెట్టాల్సిందే.
This post was last modified on October 11, 2023 7:25 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…