మెగా హీరోల్లో ఎక్కువ మంది మాస్ మసాలా చిత్రాలపైనే మక్కువ చూపిస్తుంటారు. చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్… అప్పుడప్పుడూ ఇతర జోనర్ చిత్రాలు చేసినా కానీ మాస్ ఆడియన్స్ ని మాత్రం విస్మరించరు. కానీ వరుణ్ తేజ్ మొదట్నుంచీ ఈ పంథాలో నడవడానికి ఆసక్తి చూపించలేదు.
ఆరడుగుల రూపం, మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలు అన్నీ వున్నా కానీ వరుణ్ విలక్షణ పాత్రలు చేయడానికే మొగ్గు చూపిస్తూ వచ్చాడు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత ఇప్పుడు చేస్తోన్న బాక్సింగ్ బ్యాక్‍డ్రాప్ సినిమాతో వరుణ్ ఇక యాక్షన్ మోడ్‍లోకి వెళ్లిపోయాడనే భావించారు. కానీ ఈ మూసలోకి వెళ్లడానికి వరుణ్ ఇష్టపడడం లేదు. ఫి
దా, తొలిప్రేమ చిత్రాలతో తాను లవర్‍బాయ్‍గా కూడా మెప్పించగలనని నిరూపించిన వరుణ్ తదుపరి చేసే చిత్రాల్లో ఒకటి రొమాంటిక్ ఎంటర్‍టైనర్ కాగా, మరొకటి అనిల్ రావిపూడి తీసే ‘ఎఫ్ 3’ కామెడీ. ఆ రెండు సినిమాల తర్వాతే యాక్షన్ సినిమా ఏదైనా చేస్తాడట.
అందుకే ఈలోగా తన దగ్గరకు వచ్చిన యాక్షన్ స్టోరీస్ రిజెక్ట్ చేసి ఒక లవ్‍స్టోరీ సెలక్ట్ చేసుకున్నాడట. తన స్క్రీన్ ఇమేజ్ విషయంలో వరుణ్‍కి వున్న క్లారిటీ సూపర్ అని మెగా ఫాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates