నిన్న జరిగిన రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది మరోసారి హైలైటయ్యాడు. మాములుగా తగినంత టైం, మైక్ ఇస్తే ఓ రేంజ్ లో ఎలివేషన్లతో ఊపేసే ఈ హాస్య నటుడు వెరైటీగా అసలు హీరో కిరణ్ అబ్బవరం గురించి కాకుండా స్టార్లు, వారసులు, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయాల గురించి ఏకంగా పావు గంట సేపు మాట్లాడ్డం వచ్చినవాళ్లకేమో కానీ మిగిలిన అభిమానులకు మాత్రం మంచి గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చేశాయి. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి తారక్, చరణ్, బన్నీ, మహేష్ బాబు, ప్రభాస్ దాకా ఎవరినీ వదలకుండా అందరనీ కవర్ చేశాడు.
అంతసేపు రూల్స్ రంజన్ కి సంబంధం లేని టాపిక్ గురించి హైపర్ ఆది మాట్లాడ్డం ఆశ్చర్యంగానే ఉన్నా దీని వల్ల కలిగిన ప్రయోజనాలు రెండున్నాయి. మొదటిది ఈ స్పీచ్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం. ఎవరికి వారు తమ హీరోల తాలూకు వెర్షన్లను కట్ చేసుకుని ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. రెండు కిరణ్ అబ్బవరంని టార్గెట్ చేసుకుంటున్న ట్రోల్స్ ని ఉద్దేశించి ఇతనూ భవిష్యత్తులో స్టార్ అవుతాడనే సంకేతం బలంగా ఇవ్వడం. ఇవి రెండూ పబ్లిసిటీకి ఉపయోగపడేవే. అక్టోబర్ 6 విపరీతమైన పోటీ నేపథ్యంలో ఇది అవసరమే.
సో ఏ ఉద్దేశంతో మాట్లాడినా కోరుకున్న కార్యమైతే నెరవేరింది. ప్రత్యేకంగా స్పెషల్ స్టార్ గెస్ట్ ఎవరూ లేకపోవడంతో రూల్స్ రంజన్ బృందానికి వాళ్లకు వాళ్ళే అతిథులయ్యారు. కొడుకే దర్శకుడు కావడంతో నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త విడత వారాహి యాత్ర ఉండటంతో పవర్ స్టార్ డ్రాప్ అయ్యారు. దీంతో ఛాన్స్ మిస్ అయ్యింది. లేదంటే హైప్ ఇంకో లెవెల్ కు వెళ్ళేది. నవ్వించడమే లక్ష్యంగా రూల్స్ రంజన్ తీశామని కిరణ్ అబ్బవరం కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మీటర్ గాయాన్ని మానిపోయేలా చేయాల్సింది ఈ సినిమానే.
This post was last modified on October 1, 2023 11:44 am
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…