Movie News

దిల్ రాజు సంక్రాంతి పట్టుదల ఎందుకంటే

సంక్రాంతి సీజన్ గురించి ఆల్రెడీ టాలీవుడ్ వర్గాల్లో ఎంత పెద్ద చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఎవరు వస్తారో ఎవరు చివరి దాకా ఉంటారో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటిదాకా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పిన సినిమాలు గుంటూరు కారం, హనుమాన్, ఈగల్. ఎలాగూ సలార్  డిసెంబర్ అంటున్నారు కాబట్టి టెన్షన్ లేదు. సరే ఇంత పోటీ ఉన్నా సరే నిర్మాత దిల్ రాజు మాత్రం విజయ్ దేవరకొండ 13 (ఫ్యామిలీ స్టార్ టైటిల్ పరిశీలనలో ఉంది)ని ఎట్టి పరిస్థితుల్లో పండగ బరిలో దింపాలని గట్టిగా డిసైడైపోయారు. ఆ మేరకు అఫీషియల్ గా ప్రీ లుక్ రూపంలో హింట్ కూడా ఇచ్చేశారు.

బాగానే ఉంది కానీ మహేష్ బాబు, రవితేజలను ఎదురుగా పెట్టుకుని విజయ్ దేవరకొండతో ఇంత రిస్క్ చేయడం ఏమిటనే సందేహం వస్తోందా. ఇక్కడ దిల్ రాజు క్యాలికులేషన్లు వేరు. ఈ ఏడాది జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి దిగ్గజాల నడుమ తన డబ్బింగ్ మూవీ వారసుడుని దింపారు. కంటెంట్ ఎంత రొటీన్ గా ఉన్నా, ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నా కమర్షియల్ గా దానికైన ఖర్చుకి బాగానే ఆడి లాభాలు కూడా ఇచ్చింది. అజిత్ తెగింపుని సైతం లెక్కచేయలేదు. గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి మధ్య శతమానంభవతితో బంపర్ హిట్టు కొట్టడం ఆయనకు అనుభవమే.

ఈ నమ్మకంతోనే రేస్ లో ఎన్ని ఉన్నా సరే తన ఫ్యామిలీ స్టార్ గుర్రాన్ని పందెంలో దింపాలని నిర్ణయించుకున్నారు. ఎలాగూ ఈ సీజన్ సులభంగా ముగ్గురు హీరోలకు టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ దాటించే సత్తా చూపిస్తుంది. అలాంటప్పుడు విజయ్ దేవరకొండకున్న ఇమేజ్ కి జనాన్ని థియేటర్లకు రప్పించడం పెద్ద కష్టం కాదు. పైగా సర్కారు వారి పాట ఫైనల్ రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దర్శకుడు పరశురామ్ ఈ స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాకు గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

This post was last modified on September 27, 2023 1:50 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

15 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago