Movie News

బాలయ్య సినిమాకి భయం లేదు అభయమే

చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత మారిన రాజకీయ వాతావరణంలో అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్యంగా బాలకృష్ణ చూపిస్తున్న దూకుడు ఒకవైపు పార్టీ వర్గాలకు సంతోషాన్ని కలగజేస్తున్నా, ఇంకో పాతిక రోజుల్లో విడుదల కాబోతున్న భగవంత్ కేసరి మీద ఏమైనా ప్రభావం ఉంటుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పరిణామాలను మళ్ళీ రిపీట్ చేస్తారేమోనని వాళ్ళ భయం. కానీ బాలయ్య దర్శక నిర్మాతలు ఎలాంటి ఆందోళన చెందటం లేదట. కొంత ప్యాచ్ వర్క్ తప్ప షూటింగ్ మొత్తం ఆల్రెడీ పూర్తయిన సంగతి తెలిసిందే.

భగవంత్ కేసరిని ఏదో ఒకటి చేయాలంటే ఉన్న మార్గాలు రెండే. ఒకటి టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడం. రెండు బెనిఫిట్ షోలకు నో చెప్పడం. తెలంగాణలో ఈ సమస్య లేదు. ఎటొచ్చి ఏపీలో బాలయ్య మూవీని ఇబ్బంది పెట్టాలనుకుంటే పై రెండు మార్గాల తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే టైగర్ నాగేశ్వరరావు, లియోని కూడా నియంత్రించాలి. అసలు భగవంత్ కేసరి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ వరకు హైకే అడగకపోవచ్చు. తెల్లవారుఝామున ప్రీమియర్లకు బదులు రెగ్యులర్ అయిదు షోలకే మొగ్గు చూపొచ్చు.  టాక్ బాగా వస్తే ఇదసలు సమస్యే కాదు.

సో ఫ్యాన్స్ వర్రీ కావడానికి ఏమీ లేదు. బ్యాలన్స్ ని వీలైనంత వేగంగా పూర్తి చేసి సెన్సార్ కాపీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తమన్ రీ రికార్డింగ్ జరుగుతోంది. దసరా రేస్ నుంచి తప్పుకోవచ్చనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అలాంటి ఛాన్సే లేదని టీమ్ మెంబర్స్ స్పష్టం చేస్తున్నారు. ప్రమోషన్ పరంగా లియో కాస్త దూకుడుగా ఉన్నప్పటికీ పనుల ఒత్తిడి దృష్ట్యా భగవంత్ కేసరి టీమ్ ఇంకా యాక్టివ్ కాలేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తగిన వేదికను ఖరారు చేసి ట్రైలర్ కట్ రెడీ చేస్తున్నారు.  ఈ లెక్కన పొలిటికల్ హీట్ కి బాలయ్య సినిమాకొచ్చిన ఇబ్బంది లేదు. 

This post was last modified on September 22, 2023 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago