అల్లు అర్జునుడి పాన్‍ ఇండియా అస్త్రం!

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‍ తెలుగేతర మార్కెట్లను టార్గెట్‍ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాలుగు భాషలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‍ కూడా ప్లాన్‍ చేస్తున్నా కానీ ఇది ప్రధానంగా పాన్‍ సౌత్‍ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనుంది. రష్మిక హీరోయిన్‍ అవడం వల్ల తమిళ, కన్నడ మార్కెట్లలో ఢోకా వుండదు. ఎలాగో మలయాళంలో అల్లు అర్జున్‍కి గ్యారెంటీ మార్కెట్‍ వుండనే వుంది.

కానీ కొరటాల శివతో చేసే చిత్రాన్ని మాత్రం పూర్తిస్థాయి పాన్‍ ఇండియా ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దాలని అల్లు అర్జున్‍ కోరుకుంటున్నాడు. ఇందుకోసం బాలీవుడ్‍ నుంచి ప్రముఖ హీరోయిన్‍ని తీసుకురావాలని ఫిక్సయ్యారు. సాహోలో నటించిన శ్రద్ధ కపూర్‍ అయితే ఎలా వుంటుందనే చర్చ జరిగినట్టు సమాచారం. వీలుంటే ఇంకా పెద్ద రేంజ్‍ హీరోయిన్‍ని లేదా శ్రద్ధనే తీసుకుంటే ఈ చిత్రానికి బాలీవుడ్‍లో రీచ్‍ వుంటుందని భావిస్తున్నారు.

అలాగే సపోర్టింగ్‍ కాస్ట్ కూడా నార్త్ ఇండియాలో పాపులర్‍ అయిన వాళ్లయితే బెస్ట్ అనుకుంటున్నారు. కొరటాల శివ చెప్పిన కథ కూడా అన్ని భాషల వారికీ కనక్ట్ అయ్యే యూనివర్సల్‍ పాయింటే కావడంతో అల్లు అర్జున్‍ ఈ చిత్రం పట్ల చాలా ఎక్సయిటెడ్‍గా వున్నాడు.