షాకింగ్ విషాదం చోటు చేసుకుంది. బిచ్చగాడు ఫేం.. కోలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ ఆంటోని ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పన్నెండో తరగతి చదువుతున్న ఆయన కుమార్తె మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.
చెన్నైలోని విజయ్ ఆంటోని ఇంట్లో ఆయన కుమార్తె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. బిచ్చగాడు సినిమా తర్వాత నుంచి ఆయనకు తెలుగులో మార్కెట్ పెరగటమే కాదు.. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా విడుదల అవుతోంది. విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయం బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. చిన్న వయసులో ఉన్న ఆమె అంతటి తీవ్ర నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.
తీవ్రమైన ఒత్తిడితో ఆమె ఉన్నట్లుగా చెబుతున్నారు. మీరా మరణవార్త గురించి తెలిసినంతనే తమిళ.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇంట్లో మీరా ఊరి వేసుకున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంటికి దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించిన విషయాన్నివైద్యులు తెలిపారు.
చెన్నై డీడీకే రోడ్ లోని విజయ్ ఆంటోని నివాసం ఉంది. ఈ తెల్లవారుజామున (మంగళవారం) మూడు గంటల వేళలో మీరా ఉరి వేసుకున్న విషయాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. తన కుమార్తె ఆత్మహత్యపై విజయ్ ఆంటోని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కుమార్తె ఆత్మహత్యతో తీవ్రమైన విషాదంలో మునిగిన ఆయనకు అభిమానులు ధైర్యం చెబుతున్నారు. బాధ పడకు అన్నా.. అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఆమె ఆత్మహత్య సందర్భంగా గతంలో సూసైడ్ థాట్స్ గురించి విజయ్ ఆంటోని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారన్న విషయంపై గతంలో విజయ్ ఆంటోని తన అభిప్రాయాల్ని పంచుకుంటూ.. ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు.. చెప్పినట్లుగా.. కమిట్ మెంట్ తో ఇచ్చిన పనిని చేయలేకపోయినప్పుడు.. చిన్నపిల్లలు అయితే చదువు విషయంలో వచ్చే ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని పేర్కొన్నారు. ఆత్మహత్యలపై ఇంతటి క్లారిటీ ఉన్న ప్రముఖుడి ఇంట్లోనే ఈ విషాదం చోటు చేసుకోవటం అయ్యో అనిపించక మానదు.
This post was last modified on September 19, 2023 9:04 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…