తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా బాలకృష్ణ తెలుగుదేశం వ్యవహారాలతో బిజీ కావడంతో భగవంత్ కేసరి వాయిదా పడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ మాట. కేవలం నాలుగైదు రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని, కొంత సమయం బాలయ్య కేటాయిస్తే వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి సర్వం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. తమన్ రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టేశాడు. చివరి నిమిషం వరకు ఒత్తిడి లేకుండా తనవైపు నుంచి ఆలస్యం జరగకుండా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.
విడుదలకు ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉంది కనక పనులను పరుగులు పెట్టించాలి. అయితే చంద్రబాబునాయుడు జైల్లో ఉన్న తరుణంలో ఒకవేళ దగ్గరలో ఆయన కనక బయటికి రాకపోతే భగవంత్ కేసరి ఈవెంట్లు నిర్వహించే విషయంలో సందిగ్దత ఎదురు కావొచ్చు. కానీ రిమాండ్ విధించింది రెండు వారాలే కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే నమ్మకం టిడిపి లీగల్ సెల్ వ్యక్తం చేస్తోంది. అలా అయితే హ్యాపీగా ఎన్ని వేడుకలైనా చేసుకోవచ్చు. ఇదంతా రాజకీయ అంశాలతో ముడిపడటం వల్ల భగవంత్ కేసరి బృందం ఓపిగ్గా ఎదురు చూస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా దసరా బరి నుంచి తప్పుకోవడం ఉండదు. బయ్యర్లకు మరోసారి అంతర్గతంగా కన్ఫర్మేషన్ ఇచ్చేశారట. లియో, టైగర్ నాగేశ్వరరావు నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీని ప్రత్యేకంగా ప్లాన్ చేయబోతున్నారు. మొన్న వదిలిన గణేష్ పాటకు మిశ్రమ స్పందనే దక్కింది. విజువల్ గా తెరమీద చూశాక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టీమ్ ఊరిస్తోంది. ఇంకా రిలీజ్ చేయాల్సిన సాంగ్స్ ఉన్నాయి. ట్రైలర్ కట్ సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక, ఏర్పాట్లు చూసుకోవాలి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా టార్గెట్ చేరుకోవడం పక్కా అంటున్నారు. సో ఇంకే అనుమానం అక్కర్లేదు.
This post was last modified on September 17, 2023 4:01 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…