అభిషేక్ నామా అని టాలీవుడ్లో పేరున్న నిర్మాత. ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి కొన్నేళ్ల కిందట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్‌ను సవాల్ చేసిన వ్యక్తి ఇతను. వరుసగా పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొని దూకుడు చూపించాడు. తర్వాత నిర్మాతగా కూడా మారి సాక్ష్యం, గూఢచారి సహా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఈ మధ్య ఈ నిర్మాత నెగెటివ్ న్యూస్‌లతోనే జనాల నోళ్లలో నానుతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి తనకు ఎనిమిది కోట్ల నష్టం వచ్చిందని.. అభిమానులకు కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ తనకు కూడా న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభిషేక్ సంస్థ హ్యాండిల్లో వేసిన ట్వీట్ ఇటీవల దుమారం రేపింది. ఏదైనా ఉంటే నిర్మాతతో సెటిల్ చేసుకోవాలి కానీ.. ఇలా ట్విట్టర్లో హీరోను టార్గెట్ చేయడం ఏంటని అభిషేక్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్వీట్ బూమరాంగ్ అయిందన్నది స్పష్టం. ఇప్పుడు మరోసారి అభిషేక్ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాకు దర్శకుడిగా తన పేరే వేసుకుని పోస్టర్లు రిలీజ్ చేయడమే ఇందుక్కారణం. ముందు ఈ సినిమా నవీన్ మేడారం డైరక్షన్లో మొదలైంది. పోస్టర్ మీద రైటర్ కమ్ డైరెక్టర్‌గా తన పేరే ఉంది.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. దర్శకుడిగా తన పేరు తొలగించి అభిషేక్ పిక్చర్స్ టీమ్ అని వేశారు. కానీ కొత్త పోస్టర్లో ఏమో దర్శకుడిగా అభిషేక్ నామా పేరు పడిపోయింది. నవీన్ ఏమయ్యాడో తెలియదు. ఈ సినిమా కోసం తన సేవలు వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారని.. ఇది నేనింతే సినిమాలో సుప్రీత్ క్యారెక్టర్‌ను గుర్తు చేసేలా ఉందని నెటిజన్లు అభిషేక్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కళ్యాణ్ రామ్ ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 14, 2023 10:30 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…