కొందరు దర్శకులు నటులుగా మారి సినిమాలు చేశారు. తెలుగులో విశ్వనాథ్ గారు, దాసరి గారు నటులుగా కూడా రాణించారు. కాశీ విశ్వనాథ్ వంటి వాళ్ళు కూడా నటులుగా సెటిలయ్యారు. తరుణ్ భాస్కర్ , దేవి ప్రసాద్, వీర శంకర్ వంటి చిన్న దర్శకులు కూడా యాక్టర్స్ గా మారి బిజీ అయ్యారు. ఇక దర్శకుడు సముద్రఖని కూడా నటుడిగా తమిళ్ , తెలుగు రెండు భాషల్లో ఫుల్ బిజీ అయ్యాడు.
ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే మరో దర్శకుడు నటుడిగా మారాడు. ‘కొత్త బంగారు లోకం’తో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల తాజాగా ‘పెదకాపు 1’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఓ విలన్ కేరెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో శ్రీకాంత్ అడ్డాల సీన్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ మరో వైపు నటుడిగా కూడా ఓ టర్నింగ్ తీసుకోబోతున్నాడు.
అణచివేతకి ఎదురుతిరిగిన కుర్రాడి కథతో విలేజ్ యాక్షన్ మూవీగా ‘పెదాకాపు 1’ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఆ పాత్ర కోసం తను ఎందుకు నటుడిగా మారాడో ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఆ పాత్రకు ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్ ను ఫైనల్ చేసుకున్నారట. తను ఆ రోల్ కి ఒకే చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి కట్ చేస్తే తను ఏమైందో షూటింగ్ రాలేదని, దాంతో మిగతా బిజీ ఆర్టిస్టుల డేట్స్ కోసం అప్పుడు తన అసోసియేట్ కిషోర్ తననే ఆ కేరెక్టర్ చేయమని అప్పటికప్పుడు ఒప్పించడాని చెప్పుకున్నాడు శ్రీకాంత్.
అలా అనుకోకుండా నటుడిగా మారాను తప్ప, తనకి నటనపై ఆసక్తి లేదని తెలిపాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తను చేసిన అప్పీరియన్స్ లు ఆ టైమ్ లో ఆ ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే తప్ప అందులో తన ప్రమేయం లేదని చెప్పాడు అడ్డాల. ఏదేమైనా శ్రీకాంత్ అడ్డాల ఓ మంచి విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా హిట్టయితే ఇటు దర్శకుడిగా అటు నటుడిగా సముద్రఖని తరహాలో బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడేమో మరి.
This post was last modified on September 11, 2023 10:42 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…