ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే చేస్తారు. కంటెంట్ బయటికొస్తే దాని రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. తాజాగా శ్రీనువైట్ల – గోపీచంద్ కాంబో మూవీ లాంచ్ అయింది. ఈ కాంబో సినిమా పూజా కార్యక్రమాలతో ఇలా మొదలైందో లేదో నెటిజన్లు అప్పుడే ఈ ఇద్దరికీ హిట్ దక్కేనా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గోపీచంద్ తో పాటు వైట్లకి కూడా ఈ సినిమా హిట్టవ్వడం కీలకం. వరుస ఫ్లాపులతో హీరోగా గోపీచంద్ మార్కెట్ డ్రాప్ అవుతుంది.
అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ తర్వాత వైట్ల కి సినిమా సెట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. మధ్యలో విష్ణు మంచుతో డీ అండ్ డీ అంటూ డీ కి సీక్వెల్ ఏదో ప్లాన్ చేసుకున్నాడు వైట్ల. కానీ ఆ ప్రాజెక్ట్ మొదలు కాకముందే క్యాన్సిల్ అయింది. దీంతో శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో దర్శకుడిగా మళ్ళీ నిరూపించుకోవాల్సి ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్లాక్ బస్టర్ తో కం బ్యాక్ ఇచ్చిన సీనియర్ దర్శకుడు తెలుగులో కనబడలేదు. మరి వైట్ల అది సాదిస్తాడా ?
చిత్రాలయం స్టూడియోస్ బేనర్ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుండి ఇటలీలో మొదటి షెడ్యూల్ జరుపుకోనుంది. ఇప్పటికే వైట్ల అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు. మరి గోపీచంద్ ను హిట్ ట్రాక్ లోకి తీసుకురావడంతో పాటు తను కూడా హిట్టు కొట్టడం వైట్ల ముందున్న బరువైన భాద్యత.
This post was last modified on September 9, 2023 10:27 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…