మాములుగా ఏదైనా మంచి లేదా హిట్టు సినిమా వచ్చినప్పుడు మహేష్ బాబు నుంచి ఖచ్చితంగా ఒక ట్వీట్ ఉంటుంది. అయితే చాలా సెటిల్డ్ గా ఉంటుంది మెసేజ్. కానీ జవాన్ విషయంలో మాత్రం సూపర్ స్టార్ ఈ సూత్రాన్ని పక్కనపెట్టేశాడు. కింగ్ తో కలిసి దర్శకుడు అట్లీ కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చాడని, షారుఖ్ ఖాన్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఎవరూ సరితూగలేనంత గొప్పగా వచ్చాయని కితాబిచ్చాదు. బాద్షా ఫైర్ మీదున్నాడని, రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమని, లెజెండ్స్ నుంచి వచ్చిన స్టఫ్ ని బాగా ఎంజాయ్ చేశానని ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు.
దీంతో ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్, అటు ఖాన్ సాబ్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబు అయిపోతున్నారు. విడుదలకు ముందే ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ చేసిన మహేష్ మొదటి రోజే చూడకుండా ఉండలేకపోయాడని అర్థమైపోయింది. ఒకపక్క గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకుని మరీ షో వేసుకోవడం విశేషమే. జవాన్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. అయితే అట్లీని ఇలా ప్రశంసలతో ముంచెత్తడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ కాంబినేషన్ రావడం కన్నా మూవీ లవర్స్ కోరుకునేది ఏముంటుంది.
ప్రస్తుతం జవాన్ దూకుడు చూస్తుంటే సెలబ్రిటీలు సైతం ఆ హ్యాంగోవర్ లో పడుతున్నట్టు కనిపిస్తోంది. కొత్త కథేమీ లేకపోయినా, ఇలాంటి డబుల్ ఫోటోల సినిమాలు గతంలో ఎన్నో చూసినా తనదైన స్క్రీన్ ప్లే మేజిక్ తో అట్లీ చూపించిన మాస్ హీరోయిజం ఓ రేంజ్ లో పేలింది. అనిరుద్ రవిచందర్ పాటలు ఆశించినంతగా లేకపోయినా సరే ఆడియన్స్ మాత్రం ఆ లోపాన్ని క్షమించేశారు. మొదటి రోజే డెబ్భై అయిదు కోట్ల దాకా వసూలు చేసి రికార్డులకు శ్రీకారం చుట్టిన జవాన్ కు ఇప్పుడు అన్ని బాషల నుంచి స్టార్ల సపోర్ట్ దక్కుతోంది. ఇంకెన్ని మైలురాళ్ళు దక్కబోతున్నాయో.
This post was last modified on September 8, 2023 4:36 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…